- Telugu News Photo Gallery Technology photos Realme launches new smart phone realme gt neo2 have look on features and price
Realme GT Neo 2: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. కేవలం 36 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్..
Realme GT Neo 2: చైనాకు చెందిన ప్రముఖ రియల్ మీ తాజాగా సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. స్టెయిన్‌లెస్ స్టీల్ వాపర్ కూలింగ్ వంటి అధునాతన టెక్నాలజీతో తీసుకొచ్చిన ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 16, 2021 | 7:57 AM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా కొత్త ఫోన్ లాంచ్ చేసింది. రియల్‌మీ జీటీఈ నియో2 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లు తీసుకొచ్చింది.

6.62 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + సామ్‌సంగ్, ఈ4 అమోలెడ్ డిస్‌ప్లే అందిస్తోన్న ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించిన ఈ ఫోన్ 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కేవలం 36 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ వాపర్ కూలింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. దీని ద్వారా స్మార్ట్ ఫోన్ వేడి కాదు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెళ్ల రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.31,999, 12 జీబీ/25జీబీఈ ధర రూ. 35, 999గా ఉంది.




