PM Modi: ‘మోడీ జీ.. మా దేశాన్ని దత్తత తీసుకోండి ప్లీజ్’.. ప్రధానిని కోరిన పాక్ ఫేమస్ బ్లాగర్.. వైరల్ వీడియో
గత కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్ సరిహద్దు అంశంపై భారత్ , పాకిస్థాన్‌ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పీఓకే గురంచి ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఈక్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ బ్లాగర్, వ్యాపార వేత్త వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
గత కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్ సరిహద్దు అంశంపై భారత్ , పాకిస్థాన్‌ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పీఓకే గురంచి ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఈక్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ బ్లాగర్, వ్యాపార వేత్త వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో ఇనాయా భట్ అనే బ్లాగర్ పాకిస్తాన్‌ను లీజుకు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్థించాడు. అలాగే కశ్మీర్‌లో అంతర్భాగమైన ప్రజలు ఎంతో అదృష్టవంతులుని, ఎందుకంటే వారు భారత భూభాగంలో ఉన్నారంటూ పరోక్షంగా పాక్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాడు. ‘ ప్రస్తుతం భారత దేశం యూఎస్, యూకేలకు ధీటుగా ఎదుగుతోంది. ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా ముందుకు అడుగేస్తోంది. వాణిజ్యం, ఐటీ ఉత్పాదక రంగాల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. కానీ పాక్‌లో మాత్రం బిర్యానీ ఎలా వండాలి? మరింత రుచికరంగా వచ్చేందుకు ఏమేం కలపాలి? కబాబ్‌ల టేస్ట్ పెంచేందుకు ఏం చేయాలి? అంటూ ఆలోచిస్తూ బిజీగా ఉంటున్నారు.
పాకిస్థాన్ ప్రజలతో పాటు ఇక్కడి ప్రభుత్వం కూడా నిరుపేదనే. వారు కశ్మీర్ అంశం తప్ప పౌరుల గురించి ఏమీ పట్టదు. కాబట్టి మోడీ జీ మమ్మల్ని దత్తత తీసుకోవాలి. అప్పుడే పాక్ ప్రజల భవిష్యత్ బాగుపడుతుంది’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు బ్లాగర్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా పాక్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పతనవస్థలో ఉంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో పాక్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే గత కొన్ని రోజులుగా పాక్ సింగర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు పాక్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదే సమయంలో భారత ప్రభుత్వం, మోడీ పని తీరును ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Pakistani blogger and businessman requests @narendramodi ji to lease #Pakistan for the benefit of the Pakistani people. He also says #Kashmiris r the luckiest people in the world because they are a part of #India.@SeharShinwari ur take on this. pic.twitter.com/eX7Wx11L5S
— Inaya Bhat (@inaya_bhat) April 25, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..