AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూగబోయిన పాక్ ఆర్మీ గొంతు.. అసిమ్ మునీర్ మౌనం వ్యుహత్మకమా? నిస్సహాయతా?

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, పాకిస్తాన్‌లో ప్రకంపనలు చెలరేగాయి. అయితే, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రత్యక్ష ప్రతిస్పందన ఇవ్వలేకపోయారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో అసిమ్ మునీర్ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు.

మూగబోయిన పాక్ ఆర్మీ గొంతు.. అసిమ్ మునీర్ మౌనం వ్యుహత్మకమా? నిస్సహాయతా?
Pakistan Army Chief General Asim Munir
Balaraju Goud
|

Updated on: May 08, 2025 | 4:47 AM

Share

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారతదేశం చేసిన సర్జికల్ స్ట్రైక్ తర్వాత, పాకిస్తాన్‌లో ప్రకంపనలు చెలరేగాయి. అయితే, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రత్యక్ష ప్రతిస్పందన ఇవ్వలేకపోయారు. పాకిస్తాన్ ప్రభుత్వంలో అసిమ్ మునీర్ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ మొత్తం ఆపరేషన్ గురించి అతను మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది అతని వ్యూహమా లేక భారతదేశ సైనిక శక్తి ముందు అతని నిస్సహాయతా? అన్నదీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు. దీంతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. ఈ దాడులు పూర్తిగా ఖచ్చితమైనవి, సమతుల్యమైనవి, శక్తివంతమైనవిగా అభివర్ణించింది భారత్ సైన్యం. దీని తరువాత వెంటనే, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ స్పందించారు. దీనిని యుద్ధ చర్యగా అభివర్ణించారు. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే, ఈ మొత్తం సంఘటనపై అసిమ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ప్రతి సాధారణ సంఘటనపై ఎల్లప్పుడూ ముందుకు వచ్చి తమ గళాన్ని వినిపిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు పాక్ ఆర్మీ చీఫ్.

జనరల్ మునీర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు?

అసిం మునీర్ మౌనం అతనికి సైన్యం నుండి పూర్తి మద్దతు లభించడం లేదని సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. రిటైర్డ్ మేజర్ జనరల్ రాజన్ కొచ్చర్ ప్రకారం, పాకిస్తాన్ సైన్యంలోని చాలా మంది సీనియర్ అధికారులు మునీర్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. అందుకే, ప్రస్తుత సంక్షోభ సమయంలో, ఎటువంటి నిర్ణయాత్మక చర్య తీసుకోవడం కంటే తెరవెనుక ఉండటమే తెలివైన పని అని వారు భావిస్తున్నారు. భారతదేశం జరిపిన సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ సైనిక, రాజకీయ బలహీనతను మరోసారి బయటపెట్టింది.

భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుందని భయపడి, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని విధించింది. అదే సమయంలో, పాకిస్తాన్ రక్షణ మంత్రి, ప్రభుత్వ అధికారుల శరీర భాషలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. భారత నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ డి.పి. పాండే స్పందిస్తూ.. అసిమ్ మునీర్ పూర్తిగా ఒత్తిడిలో ఉన్నాడని, అతని మౌనం పాకిస్తాన్‌లో అంతర్గత స్థాయిలో సామరస్యం లోపించిందని పాండే అన్నారు.

ఇంతలో, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అసిమ్ మునీర్ పై విమర్శల దాడి చేశారు. భారతదేశంతో వివాదానికి జనరల్ మునీర్ నిరంకుశ స్వభావం, వ్యక్తిగత ఆశయం కారణమని వారు పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం స్వయంగా సీమాంతర ఉగ్రవాదానికి ఒక వ్యవస్థీకృత నిర్మాణంగా పనిచేస్తుందని వారు అంటున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ అత్యవసర సమావేశాన్ని కూడా ఇమ్రాన్ పార్టీ బహిష్కరించింది.

అసిం మునీర్ మౌనం భారతదేశం సైనిక ప్రతిస్పందన ప్రభావాన్ని చూపించడమే కాకుండా, పాకిస్తాన్ అంతర్గత రాజకీయ, సైనిక సంక్షోభాన్ని కూడా సూచిస్తుంది. అయితే, ఈ మౌనం ఏదైనా పెద్ద ఎత్తుగడకు సన్నాహమా లేక భారతదేశ దౌత్య, సైనిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఓటమినా అనేది ప్రశ్న..!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..