Sri Lanka: సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు లంకేయులకు సాయం.. ట్రెండింగ్‌లో శ్రీలంక డాలర్ ఛాలెంజ్
Sri Lanka Dollar Challenge: మొన్నటి వరకు నిరసనలతో హోరెత్తిన శ్రీలంకలో డాలర్ ఛాలెంజ్ హాట్ టాఫిక్ మారింది. రాజపక్స రాజీనామా తర్వాత ప్రవాశీయులు లంక ఆర్థిక పరిస్థితిపై స్పందించడం ఇంట్రస్టింగ్ గామారింది.
Sri Lanka Dollar Challenge: ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో డాలర్ ఛాలెంజ్ ట్రెండింగ్ అవుతుంది. దేశ ప్రజల ఆగ్రహానికి గురై దేశం వదిలి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా తర్వాత ఆదేశంలో పెను మార్పులు జరుగుతున్నాయి. గొటబాయ రాజీనామాపై స్పందించిన ప్రవాశీయులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షోభం కారణంగా శ్రీలంకను వదిలెల్లిన వారు.. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడినవారు స్వదేశంపై మమకారం చూపుతున్నారు. స్వంత దేశానికి డాలర్లు పంపడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే డిపాజిట్ చేసిన స్లిప్‌లను ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. శ్రీలంకేయులు ఎక్కడ స్థిరపడ్డా స్వదేశానికి సాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో #SriLankaDollarChallenge ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతుంది.
పుట్టిన మతృభూమి కోసం తన వంతు కృషిని కొనసాగిస్తానంటూ ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అందరం ఏకమై దేశాన్ని పునర్‌నిర్మించుకుందాం అంటూ మరో ప్రవాశీయుడు పిలుపునిచ్చాడు. దీనిపై స్పందించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక.. డాలర్లను పంపేందుకు పరిమితులతో కూడిన అధికారిక బ్యాంకింగ్ ఛానెల్‌లను మాత్రమే యూజ్ చేయాలని కోరింది. అయితే రాజపక్స రాజీనామా తర్వాత డాలర్ ఛాలెంజ్ ట్రెండింగ్ అవడం పెద్ద హాట్ టాఫిక్ గా మారింది.
2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. 70ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిత్యావసరాల కొరత ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం గొటబాయ రాజపక్సే కారణమని భావించిన లంకేయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. చివరకు ఆయన రాజీనామా చేసి దేశం దాటి పోయేలా నిరసనలు కొనసాగించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..