Omicron Variant: ఒమిక్రాన్‌ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలే.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక..!

Omicron Variant: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ మరోసారి విజృంభిస్తోంది. ఇక అగ్నేయాసియాలో కరోనా మహమ్మారి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ..

Omicron Variant: ఒమిక్రాన్‌ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలే.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక..!
Follow us

|

Updated on: Jan 09, 2022 | 9:03 AM

Omicron Variant: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ మరోసారి విజృంభిస్తోంది. ఇక అగ్నేయాసియాలో కరోనా మహమ్మారి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక సూచనలు చేసింది. కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ అత్యంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నా.. అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్‌వో రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌సింగ్‌ వెల్లడించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకున్నట్లయితే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌లు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌లలో ఒమిక్రాన్‌తో పాటు డెల్టా, ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయని, ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిదన్నారు.

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ తీవ్రంగా ఉండదని నిపుణులు సూచిస్తున్నా..నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ప్రస్తుతం కరోనాతో పాటు కొత్త వేరియంట్‌ కేసులు కూడా పెరుగుతున్నాయని,ఆస్పత్రుల్లో బెడ్స్‌ దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుందని సూచించారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఒమిక్రాన్‌ వేరింయట్‌ ప్రభావం తక్కువగా ఉన్నా.. తర్వాత బలంగా మారి ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టకడంలో నిబంధనలు పాటించాలని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Corona Virus: కోవిడ్‌-19 ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి.. కీలక విషయాలు వెల్లడించిన ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు

Covaxin Booster Dose: గుడ్‌న్యూస్.. కోవాక్సిన్ బూస్టర్‌ డోస్‌తో మంచి ఫలితాలు.. 90 శాతం మందిలో..

Latest Articles
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
నెలకు రూ. 40 వేలు సంపాదన.! ఈ వ్యాపారం గురించి తెలిస్తే..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
కోవిషీల్డ్ కాదు.. కోవాగ్జిన్‌‌తోనూ సైడ్ ఎఫెక్ట్సే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేస్తే బతికేవాడే! కానీ అంతలోనే..
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమేంటంటే
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
ఒక్క స్థానం కోసం 2 జట్ల మధ్య పోరు.. లెక్కలన్నీ తారుమారు..
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే