Corona Virus: కోవిడ్-19 ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి.. కీలక విషయాలు వెల్లడించిన ఐఐటీ మద్రాస్ పరిశోధకులు
Corona Virus: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా కేసులతో సతమతమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. దేశంలో..
Corona Virus: ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు ఒమిక్రాన్, మరోవైపు కరోనా కేసులతో సతమతమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. దేశంలో థర్డ్‌వేవ్ మొదలైంది. అయితే కరోనాపై ఐఐటీ మద్రాస్ పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం ఒకరి నుంచి నలుగురికి కరోనా వైరస్ సోకుతున్నట్లు తెలిపారు. కోవిడ్ తీవ్రతను అంచనా వేసేందుకు వారు ఆర్-నాట్ (ఆర్‌జీరో) విలువను లెక్కించగా ఈ విషయాలను బయటకువచ్చాయి. పరిశోధకుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య దేశంలో అధికంగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.
కరోనా కట్టడికి చర్యలు చేపడుతూ ప్రజలు గుమిగూడకుండా, ఇతర కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, దీని కారణంగా ఆర్-నాట్ విలువ తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్-నాట్ విలువ 2.69గా ఉన్నట్లు గతవారం లెక్కించింది. సెకండ్‌వేవ్‌లో ఈ విలువ గరిష్టంగా 1.69గా నమోదైనట్లు తెలిపింది. ఇక డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ ఎఫెక్ట్ 90 శాతం వరకు తక్కువగానే ఉందని అమెరికాకు చెందిన హెల్త్ మెట్రిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టఫర్ ముర్రె అంచనా వేశారు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియాలో ఫిబ్రవరిలో రోజుకు 5 లక్షల వరకు కేసులు నమోదయ్యే పరిస్థితి రావచ్చని అభిప్రాయపడ్డారు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించినప్పుడు కేసులు పెరగకుండా చేయవచ్చని ఆయన సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరికి వారు నిర్భంధ చర్యలు తీసుకుంటే కాంటాక్ట్ రేట్ తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: