Omicron: 15 దేశాలకు పాకిన ఓమిక్రాన్.. ఇతర వేరియంట్లతో పోల్చితే అంత ప్రమాదం కాదంటోన్న దక్షిణాఫ్రికా వైద్యులు..!

దక్షిణ ఆఫ్రికా, బోట్స్వానా, బెల్జియం, హాంగ్ కొంగ, ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల్లో ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి.

Omicron: 15 దేశాలకు పాకిన ఓమిక్రాన్.. ఇతర వేరియంట్లతో పోల్చితే అంత ప్రమాదం కాదంటోన్న దక్షిణాఫ్రికా వైద్యులు..!
Follow us
Venkata Chari

|

Updated on: Nov 29, 2021 | 9:58 AM

Omicron: కరోనా వైరస్ ఓమిక్రాన్ రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఓమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది. అయితే ఈ కేసులు డజనుకు పైగా దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది.

ఇప్పటికే ఆఫ్రికా అనేక దేశాల నుంచి ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఈ చర్యను దక్షిణాఫ్రికా ప్రభుత్వం అన్యాయమైనదిగా పేర్కొంటూ పలు దేశాలపై విమర్శలు కురిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్, యూకే అనేక ఇతర దేశాలు తమ విమానాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కెనడాలో ఆదివారం ఇద్దరు వ్యక్తులలో ఓమిక్రాన్ వైరస్‌ను కనుగొన్నట్లు తెలిసింది. దీంతో దేశంలో ఎనిమిది కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.

రోనావైరస్ వ్యాధి ఐదవ తరంగాన్ని ఫ్రాన్స్ ఎదుర్కొంటోంది. ఆదివారం 31,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వారిలో ఎక్కువ మంది ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICU) చికిత్స్ పొందుతున్నారు. ఇజ్రాయెల్, హాంకాంగ్, బెల్జియం లాంటి దేశాలు ఓమిక్రాన్ వైరస్ బారిన పడిన లిస్టులో చేరాయి. ఇప్పటివరకు కేసులు నమోదైన దేశాల పూర్తి జాబితా ఓసారి పరిశీలిస్తే.. దక్షిణ ఆఫ్రికా, బోట్స్వానా, బెల్జియం, హాంగ్ కొంగ, ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్ దేశాల్లో ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటి వరకు చేసిన పరిశోధలమేరకు దక్షిణాఫ్రికా వైద్యుడు ఆదివారం మాట్లాడుతూ, ఇతర కరోనా వేరియంట్లతో పోల్చితే ఓమిక్రాన్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇంట్లో చికిత్స తీసుకోవచ్చని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, డెల్టా మాదిరిగా కాకుండా, ఇప్పటివరకు రోగులు వాసన లేదా రుచిని కోల్పోయినట్లు ఎక్కడా తేలలేదన్నారు. కొత్త వేరియంట్‌తో ఆక్సిజన్ స్థాయిల్లో కూడా పెద్దగా మార్పు లేదని ప్రకటించారు.

కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ రేట్లలో భారీ అసమానతలపై దృష్టి సారించింది. అనేక అభివృద్ధి చెందిన దేశాలు థర్డ్-డోస్ బూస్టర్‌లను ఇస్తున్నప్పటికీ, వైద్య, మానవ హక్కుల సంఘాల ప్రకారం, పేద దేశాలలో 7% కంటే తక్కువ మంది ప్రజలు తమ మొదటి COVID-19 డోసును పొందారని పేర్కొంది.

Also Read:Omicron: ఒమిక్రాన్‌లో 30కి పైగా మ్యుటేషనన్లు.. ప్రమాదకరం.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎయిమ్స్ చీఫ్ పిలుపు

Omicorn Guidelines: డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ దేశాల నుంచి వస్తే టెస్టులు తప్పనిసరి..!