Omicron: ఒమిక్రాన్‌లో 30కి పైగా మ్యుటేషనన్లు.. ప్రమాదకరం.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎయిమ్స్ చీఫ్ పిలుపు

Omicron Variant: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్ లో 30కి పైగా మ్యుటేషన్‌లను పొందిందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా..

Omicron: ఒమిక్రాన్‌లో 30కి పైగా మ్యుటేషనన్లు.. ప్రమాదకరం.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎయిమ్స్ చీఫ్ పిలుపు
Omicron
Follow us

|

Updated on: Nov 29, 2021 | 9:22 AM

Omicron Variant: కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్ లో 30కి పైగా మ్యుటేషన్‌లను పొందిందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. ఇది రోగ నిరోధక శక్తి వ్యవస్థను తప్పించుకునే సామర్ధ్యాన్ని పెంపోందిస్తుందని.. దీంతో ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ పై భారత దేశంలోని వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు పనిచేసే విధానంపై  పరిశోధన చేయాల్సి ఉంటుందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని ఆయన  హెచ్చరించారు. అంతేకాదు దేశంలో అంతర్జాతీయ ప్రయాణికులతో పాటు, కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతున్న ప్రాంతంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ గులేరియా చెప్పారు. ప్రజలు తప్పని సరిగా వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు.

ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యానికి సంబంధించి వెలుబడే సమాచారంపైనే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఆధారపడి ఉంటాయని డాక్టర్‌ గులేరియా పేర్కొన్నారు. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించకూడదని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు.

నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుగా హెచ్చరించింది.  బెల్జియం, హాంకాంగ్ ,ఇజ్రాయెల్‌, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర 18 దేశాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకూ మన దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులందరికి కఠినమైన స్క్రీనింగ్ ,  టెస్టులు నిర్వహించాలని కేంద్రం గురువారం అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

Also Read:  ఫిట్ నెస్ కోసం జిమ్‌లో కష్టపడుతున్న పిల్లి.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్..