సూర్యుడు అస్తమించని దేశం.. ! అర్ధరాత్రి కూడా మిట్ట మధ్యాహ్నం లాంటి వెలుతురు.. ఎక్కడో తెలుసా..?

నిత్యం వెలుతురు ఉండడం వల్ల అర్ధరాత్రి పూట కూడా ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారని ఇక్కడి స్థానికులు తెలిపారు. కొందరు రాత్రి 2 గంటలకు ఈత కొట్టడం, కొందరు పెయింటింగ్ పనులు చేయడం, కొందరు ఫుట్‌బాల్ ఆడటం చేస్తుంటారు. అందుకే టైమ్‌ ఫ్రీజోన్‌ చేయాలని నిర్ణయించారు.

సూర్యుడు అస్తమించని దేశం.. ! అర్ధరాత్రి కూడా మిట్ట మధ్యాహ్నం లాంటి వెలుతురు.. ఎక్కడో తెలుసా..?
Time Free Zone
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 19, 2023 | 8:56 PM

సూర్యచంద్రుల ప్రకాశంతో రాత్రి, పగలు ఎప్పుడనేది తెలుసుకుంటాం. కానీ ఒకరోజు సూర్యుడు అస్తమించడం ఆగిపోయి, చంద్రుడు ఉదయించడం లేకపోతే ఎలా ఉంటుంది. అదే జరిగితే ఎలా ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది.. ఇలాంటి అసాధారణ సందేహాలు మీకు కూడా వస్తుంటాయి కదా..కానీ, ఇది నిజంగా జరుగుతుంది. ప్రపంచంలో సూర్యుడు అస్తమించని ప్రదేశం కూడా ఉంది. నార్వేలోని సోమారోయ్ ద్వీపంలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. అయితే, ఇది కొన్ని నెలలు మాత్రమే జరుగుతుంది. మూడు నెలల కంటే ఎక్కువ సమయం సూర్యుడు అస్తమించని ప్రదేశం నార్వేలోని సోమారోయ్ ద్వీపం.. మనం మన రోజును సూర్యచంద్రులతో ప్రారంభించి ముగిస్తాము. పగలు, రాత్రి అనే భావన సూర్యచంద్రుల వల్ల ఏర్పడింది. కానీ, సోమరోయ్ ద్వీపంలో కొన్ని నెలల పాటు ప్రజలు మరో ప్రపంచానికి చేరుకుంటారు. అక్కడ మన ప్రపంచం, నియమాలు, నిబంధనలు పనిచేయడం మానేస్తాయి.

సోమారోయ్‌ ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న ఒక ద్వీపం. దీని కారణంగా ఇక్కడ వేసవిలో 24 గంటల పాటు సూర్యుడు ప్రకాశిస్తాడు. మే మధ్య నుండి జూలై చివరి వరకు సుమారుగా 70రోజుల పాటు సూర్యుడు నిరంతరంగా కనిపిస్తాయి. అయితే, ఇక్కడ సమస్య కూడా ఉంది. అదేంటంటే.. ఇక్కడ దాదాపు 3 నెలలు చీకటి కనిపించదు. కానీ, శీతాకాలంలో 3 నెలలపాటు చీకటి కమ్మేస్తుంది.

ఈ నార్వే ద్వీపం జనాభా 300 నుండి 350 మంది మాత్రమే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మొత్తం ద్వీపం టైమ్ ఫ్రీ జోన్‌గా ప్రకటించబడింది. నిత్యం వెలుతురు ఉండడం వల్ల అర్ధరాత్రి పూట కూడా ప్రజలు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారని ఇక్కడి స్థానికులు తెలిపారు. కొందరు రాత్రి 2 గంటలకు ఈత కొట్టడం, కొందరు పెయింటింగ్ పనులు చేయడం, కొందరు ఫుట్‌బాల్ ఆడటం చేస్తుంటారు. అందుకే టైమ్‌ ఫ్రీజోన్‌ చేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

ఈ ద్వీపంలో టైమ్ ఫ్రీ జోన్ అయిన తర్వాత దుకాణాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఓపెన్‌ చేయటం, మూసివేయడం కోసం సమయం చూసుకునేవారు. సౌకర్యవంతమైన సమయాల్లో స్కూల్స్‌ కూడా తెరిచి, తిరిగి మూసివేసేవారు. అంటే మొత్తం మీద ఇక్కడ సమయానికి సంబంధించి ఎటువంటి పరిమితి లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ