AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urfi Javed Pics: ఉర్పీ వింత డ్రెస్సు.. హ్యాండ్‌బ్యాగ్‌తో స్కర్ట్, టాప్‌.. సూపర్‌ అంటున్న నెటిజన్లు..

గొలుసులు, జనపనార సంచులు, పూలు, పండ్లు, వైర్లు ఇలా అనేకం ట్రై చేసింది. ఆమె శైలి అసాధారణ భావన అయినప్పటికీ నెటిజన్లు తనను ఎంతగానో ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆమె కొత్తగా ట్రై చేసిన డ్రెస్‌ చూసి మరోమారు నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఈ సారి వేసిన డ్రెస్‌ హ్యాండ్‌బ్యాగ్. అవును.. ఈసారి హ్యాండ్‌బ్యాగ్‌తో ప్రయోగాలు చేసి దానితో వెరైటీ డ్రస్‌ తయారు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఈసారి ఆమె ఆలోచనను నిజంగా ఇష్టపడ్డారు.

Urfi Javed Pics: ఉర్పీ వింత డ్రెస్సు.. హ్యాండ్‌బ్యాగ్‌తో స్కర్ట్, టాప్‌.. సూపర్‌ అంటున్న నెటిజన్లు..
Urfi Javed
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2023 | 6:51 PM

Share

ఉర్ఫీ జావేద్ చాలా మందికి తెలిసిన పేరు. బిగ్ బాస్ OTT ఫేమ్ తన అసాధారణమైన ఫ్యాషన్‌తో, వింత వింత స్టైల్స్‌తో వీక్షకులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ తనదే పైచేయి. ఈ నటీ ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రయత్నిస్తుంది. అలాగే, తనకు కనిపించిన ప్రతిదానితో దుస్తులను తయారు చేసి తానే స్వయంగా ధరించి చూపెడుతుంది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా అనేక వేషధారణలతో ప్రయోగాలు చేసింది. విచిత్రమైన దుస్తులలో కనిపించింది. గొలుసులు, జనపనార సంచులు, పూలు, పండ్లు, వైర్లు ఇలా అనేకం ట్రై చేసింది. ఆమె శైలి అసాధారణ భావన అయినప్పటికీ నెటిజన్లు తనను ఎంతగానో ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆమె కొత్తగా ట్రై చేసిన డ్రెస్‌ చూసి మరోమారు నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఈ సారి వేసిన డ్రెస్‌ హ్యాండ్‌బ్యాగ్. అవును.. ఈసారి హ్యాండ్‌బ్యాగ్‌తో ప్రయోగాలు చేసి దానితో వెరైటీ డ్రస్‌ తయారు చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఈసారి ఆమె ఆలోచనను నిజంగా ఇష్టపడ్డారు.

ఎప్పటిలాగే, ఆమె కొత్త వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఊర్ఫీ కొత్త వీడియో అనగానే.. సాధారణంగా అందరూ ఆమె కొత్త డ్రెస్‌ను భావిస్తారు. కానీ, ఈ వీడియో ప్రారంభంలో ఉర్ఫీ గోధుమ రంగు హ్యాండ్‌బ్యాగ్‌ని చూపించింది. ఆ తర్వాత ఆమె ఆ బ్యాగ్‌నే డ్రస్‌గా ధరించింది. బ్యాగ్‌లోని హ్యాండిల్స్‌ను సస్పెండర్‌లుగా ఉపయోగించింది. దానిని స్టైల్‌గా వదులుగా ఉంచడంతో ఇది చాలా వినూత్నంగా కనిపించింది. బ్యాగ్ పొట్టి జిప్ ఆ డ్రస్‌కి జేబులా మారింది. ఈ పాకెట్‌లో డబ్బు దాచుకోవచ్చు. ఆమె జుట్టును బన్‌ల కట్టి, మిరుమిట్లు గొలిపే మేకప్, పొడవాటి చెవిపోగులతో మరింత స్టైలిష్‌గా కనిపించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

అయితే, ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే నెటిజన్లు ఈ ఆలోచనను నిజంగా ఇష్టపడుతున్నారు. చాలా మంది ఈ స్కర్ట్, టాప్ కాంబో బాగుందంటున్నారు. సూపర్ ఇన్నోవేటివ్‌గా కూడా ఉందని చెప్పారు. ఇది ఖచ్చింగా ఒక పార్టీలో ధరించగలిగేదిగా ఉందంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..