AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మేకప్‌ మహాత్యం..! పెళ్లి కూతురిలా మారిన యువకుడి అందం చూస్తే.. అమ్మాయిలు కూడా చూపుతిప్పుకోలేరు..

ఇటీవల ఒక పెళ్లి కూతురి మేకప్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. నవ వధువు మేకప్‌కు ముందు, తరువాత ఆమె లుక్ చూసి ఇంటర్‌నెట్‌ ప్రజలు షాక్‌ తిన్నారు. అయితే, ఇక్కడో మరో వ్యక్తి మేకప్‌తో మరో నాలుగు అడుగులు ముందుకు వేశాడనే చెప్పాలి. ఇతడు మేకప్ వేసుకుని అందమైన అమ్మాయిలా వేషం మార్చిన దృశ్యం అమ్మాయిలను కూడా చూపుతిప్పునివ్వకుండా చేసింది. వీడియో చూసిన నెటిజన్లు చాలా మందికి ఇది జీర్ణం కావడం లేదు.

Watch: మేకప్‌ మహాత్యం..! పెళ్లి కూతురిలా మారిన యువకుడి అందం చూస్తే.. అమ్మాయిలు కూడా చూపుతిప్పుకోలేరు..
Boy Became Girl
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2023 | 4:09 PM

Share

మేకప్ ఎవరికైనా అందాన్ని ఇస్తుంది! కానీ, మేకప్ అందాన్ని పెంచడమే కాదు మనుషుల ముఖాన్ని కూడా మారుస్తుంది! సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. అందులో మీరు మేకప్ అద్భుతాన్ని చూడవచ్చు. కొందరు మేకప్ సహాయంతో తమను తాము సూపర్‌స్టార్‌గా మార్చుకుంటారు. కొందరు తమను తాము కొత్తగా పరిచయం చేసుకుంటారు. ఇటీవల, ఒక వధువు వీడియో వైరల్ అయ్యింది. ఆమె మేకప్‌కు ముందు, తరువాత ఆమె లుక్ చూసిన ఇంటర్నెట్ ప్రజలను షాక్‌కు గురి చేసింది. అయితే, ఇక్కడో వ్యక్తి మేకప్‌తో మరో నాలుగు అడుగులు ముందుకు వేశాడనే చెప్పాలి. వీడియోలో ఓ వ్యక్తి మేకప్ వేసుకుని అమ్మాయిలా వేషం మార్చిన దృశ్యం చూసి చాలా మందికి జీర్ణం కావడం లేదు. ఈ వ్యక్తులు అబ్బాయిల భావాలతో ఆడుకుంటున్నారంటూ కొందరు నెటిజన్లు వాపోతున్నారు.

ఈ వీడియో నిడివి కేవలం 43 సెకన్లు మాత్రమే. కానీ, ఒక వ్యక్తి ముందుగా తన గడ్డం, మీసాలు తొలగించుకోటంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత లెన్స్‌లు వేసుకుని మేకప్‌ వంతు. అవును, మహిళా మేకప్ ఆర్టిస్ట్ పురుషుడికి మేకప్ చేస్తూ వెళుతుండగా, అతను చూసేందుకు పూర్తిగా అమ్మాయిగా మారిపోతాడు. మేకప్‌ పూర్తైన తర్వాత అతడు గుర్తుపట్టలేనంతగా అందమైన నవ వధువులా కనిపిస్తున్నాడు. ఎవరైనా ఇతడిని మొదటిసారి చూసినప్పుడు ఖచ్చితంగా అతడు స్త్రీ అనే పొరపాటు చేస్తారు. కేరళలోని కొల్లం జిల్లాలో చమయవిళక్కు పండుగను జరుపుకుంటారు. ఇందులోభాగంగా పురుషులు స్త్రీల దుస్తులు ధరించి, అచ్చం వారిలాగే తయారై ఇందులో పాల్గొంటారు. వారి ఆరాధ్య దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేస్తారు. అయితే, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ‘హన్స్నా జరూరీ హై’ @HasnaZarooriHai హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో జూన్ 18 ఆదివారం పోస్ట్ చేసారు. ఈ ట్వీట్‌కు 2 లక్షలకు పైగా వ్యూస్‌ రాగా, 2.5 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, చాలా మంది వినియోగదారులు వీడియోపై స్పందించారు. ఒక వ్యక్తి సరదాగా ఇలా రాశాడు – ప్రేమంటే ఆరాధన అని ఎప్పటి నుంచో చెబుతున్నాను అంటూ కామెంట్‌ చేశారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ మేకప్‌ మహాత్యం మామూలుగా లేదు గురూ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే