Viral Video: మెట్రో రైల్లో ఇదేం పని తల్లి..! వీళ్లు మారరు.. ఇక ఆ దేవుడే కాపాడాలి..!

ఈ సారి వైరల్‌ అవుతున్న ఈ సీన్‌ కూడా ఢిల్లీ మెట్రోకు సంబంధించినదే కావటం పట్ల నెటిజన్లు మరింతగా మండిపడుతున్నారు. అధికారులు, సిబ్బంది కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు మనుషులు మాత్రం మెట్రోలో తమ వింత చేష్టలు మానటం లేదు. తాజాగా ఈ యువతి చేసిన పనితో మెట్రో ప్రయాణికులతో పాటు, నెటిజన్లు సైతం తలలు పట్టుకుంటారు.

Viral Video: మెట్రో రైల్లో ఇదేం పని తల్లి..! వీళ్లు మారరు.. ఇక ఆ దేవుడే కాపాడాలి..!
Delhi Metro
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 19, 2023 | 7:18 PM

మెట్రోలో డ్యాన్స్, రొమాన్స్, స్నానాలు, స్టంట్స్‌.. తర్వాత ఇప్పుడు ఓ అమ్మాయి చేసిన వింత చర్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మేడమ్ మెట్రోలో తన జుట్టును స్ట్రెయిట్ చేస్తున్న దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. వీడియో చూసిన యూజర్లు రకరకాలుగా రియాక్షన్‌లు ఇస్తున్నారు. ఈ సారి వైరల్‌ అవుతున్న ఈ సీన్‌ కూడా ఢిల్లీ మెట్రోకు సంబంధించినదే కావటం పట్ల నెటిజన్లు మరింతగా మండిపడుతున్నారు. అధికారులు, సిబ్బంది కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు మనుషులు మాత్రం మెట్రోలో తమ వింత చేష్టలు మానటం లేదు. తాజాగా ఈ యువతి చేసిన పనితో మెట్రో ప్రయాణికులతో పాటు, నెటిజన్లు సైతం తలలు పట్టుకుంటారు.

ఈ వీడియో మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో హస్నాజరూరిహై (@హస్నాజరూరిహై) అనే పేజీలో షేర్‌ చేశారు. ఈ 15 సెకన్ల వీడియోలో మెట్రోలోని ఒక కోచ్ లోపల ఒక అమ్మాయి తన జుట్టును స్ట్రెయిట్‌నర్‌తో స్ట్రెయిట్ చేసుకోవటం మనం చూడొచ్చు. జనాల మధ్య ఈ అమ్మాయి ప్లగ్ పాయింట్‌లో స్ట్రెయిట్‌నర్‌ని పెట్టుకుని అజాగ్రత్తగా జుట్టును సరిచేస్తోంది. పక్కనే నిల్చున్న ఇంకో అమ్మాయి తనవైపే ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.

ఇవి కూడా చదవండి

జూన్ 17న షేర్ చేసిన ఈ వీడియోకి లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో చాటా మంది నెటిజన్లు దీన్ని లైక్ చేసారు. వినియోగదారులు అనేక రకాలుగా కామెంట్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. వినియోగదారుల్లో ఒకరు ఇలా వ్రాశారు – ఆ అమ్మాయి తమ ఇంట్లో విద్యుత్ బిల్లు ఆదా చేస్తోందని చెప్పగా, మరోకరు పన్నీగా ఇక మనం.. హిమాలయాలకు బయలుదేరాలి అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..