AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ విలువ ఎంతో తెలుసా..? ఇప్పుడు ఆర్డర్‌ ఇస్తే ఏడాదికి వస్తుంది..!

ఈవెంట్‌తో సంబంధం లేకుండా, అత్యంత విశిష్టతతో కనిపిస్తారు నీతా అంబానీ. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ విభిన్నమైనవి, చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుండి, నీతా అంబానీ లుక్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో

Nita Ambani: నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ విలువ ఎంతో తెలుసా..? ఇప్పుడు ఆర్డర్‌ ఇస్తే ఏడాదికి వస్తుంది..!
Nita Ambani
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2023 | 7:08 PM

Share

నీతా అంబానీ ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆమె స్టైల్, ఫ్యాషన్ ప్రతీసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె తన ఫ్యాషన్ ఔటింగ్‌లతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, అత్యంత విశిష్టతతో కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ విభిన్నమైనవి, చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుండి, నీతా అంబానీ లుక్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నీతా అంబానీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నీతా అంబానీ తన చేతిలో తెల్లటి మాట్ ఎలిగేటర్ హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. ఈ హ్యాండ్‌బ్యాగ్‌ హెర్మేస్ బిర్కిన్ బ్రాండ్‌కు చెందినది. దీని డిజైన్ చాలా ప్రత్యేకమైనది.

నీతా అంబానీ చేతిలో కనిపించిన హ్యాండ్‌ బ్యాగ్‌పై బిల్డింగ్‌ బొమ్మ కనిపించింది. పర్సు హ్యాండిల్‌పై నారింజ రంగులో వేలాడుతున్న విండోస్‌ ఆకారం ఉంది. ఇంకా ఆ పర్స్‌పై పలు అక్షరాలతో రూపొందించబడింది. ఈ పర్స్ ధర ఇండియన్‌ కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 3.2 కోట్లు అని తెలిసింది.

ఈ బ్రాండ్ బ్యాగ్‌లు కొనడం చాలా కష్టం. దాని ధర కారణంగా మాత్రమే కాకుండా, బ్రాండ్ ఎంపిక చేసుకున్న వ్యక్తుల కోసం మాత్రమే బ్యాగ్‌లను డిజైన్ చేస్తుంది. బ్యాగ్‌ను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చిన తరువాత 1 సంవత్సరం పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. నీతా అంబానీకి హ్యాండ్‌బ్యాగ్‌లంటే చాలా ఇష్టమని, ఆమె కలెక్షన్‌లో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల బ్యాగ్‌లు ఉన్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..