నోకియా నుంచి న్యూ స్మార్ట్ టీవీ… 75 ఇంచుల 4కే అల్ర్టా హెచ్ డీ టీవీ… ధర లక్ష రూపాయల పైనే…

స్మార్ట్‌ఫోన్ల త‌యారీలో ప్రసిద్ధి చెందిన నోకియా సంస్థ ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలోనూ దూసుకుపోతోంది. నోకియా స్మార్ట్ టీవీ శ్రేణి లో ఇప్పుడు 75 ఇంచుల నూతన టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది.

నోకియా నుంచి న్యూ స్మార్ట్ టీవీ... 75 ఇంచుల 4కే అల్ర్టా హెచ్ డీ టీవీ... ధర లక్ష రూపాయల పైనే...
Follow us

|

Updated on: Nov 29, 2020 | 4:56 PM

Nokia Smart TV 75-inch model has been launched స్మార్ట్‌ఫోన్ల త‌యారీలో ప్రసిద్ధి చెందిన నోకియా సంస్థ ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలోనూ దూసుకుపోతోంది. నోకియా స్మార్ట్ టీవీ శ్రేణి లో ఇప్పుడు 75 ఇంచుల నూతన టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త టీవీని యూరప్‌లోని నోకియా లైసెన్స్‌దారు స్ట్రీమ్‌వ్యూ ఆవిష్కరించింది. నోకియా స్మార్ట్ టీవీ 75-అంగుళాల మోడల్ హెచ్ డీ ఆర్ 10 సపోర్ట్‌తో పాటు 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో వస్తోంది. మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందించేదుకు ఇందులో డాల్బీ విజన్ స‌పోర్ట్‌ను కూడా అందించారు. కాగా గ‌తంలో స్ట్రీమ్‌వ్యూ నోకియా స్మార్ట్ టీవీని 32-, 43-, 50-, 55-, 65-అంగుళాల మోడళ్లను యూరోపియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. 4 కే, అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో స్మార్ట్ టీవీ 58 అంగుళాల మోడల్‌ను కూడా నోకియా కంపెనీ విడుదల చేసింది.

నోకియా స్మార్ట్ టీవీ… ధర ఎంతంటే…

నోకియా స్మార్ట్ టీవీ 75-అంగుళాల మోడల్ ధర (యూరో)1,399 (సుమారు రూ. 1,23,300) గా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్ డిసెంబర్ 1న స్ట్రీమ్ వ్యూ ద్వారా యూరోపియన్ మార్కెట్లలో విడుద‌ల చేయ‌నున్నారు. 75 అంగుళాల మోడ‌ల్‌తోపాటు స్ట్రీమ్ వ్యూ నోకియా స్మార్ట్ టీవీని 32-, 43-, 50-, 55, 65-అంగుళాల స్మార్ట్ టీవీ మోడళ్లను విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఫ్లిప్‌కార్ట్ నోకియా స్మార్ట్ టీవీ 32-అంగుళాల హెచ్‌డీ రెడీ, నోకియా స్మార్ట్ టీవీ 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, నోకియా స్మార్ట్ టీవీ 43-అంగుళాల 4కే, నోకియా స్మార్ట్ టీవీ 50-అంగుళాల 4కే, నోకియా స్మార్ట్ టీవీ 55అంగుళాల 4కే, నోకియా స్మార్ట్ టీవీ 65-అంగుళాల 4 కే మోడళ్లను భారతదేశంలో అందుబాటులోకి వచ్చాయి.

నోకియా స్మార్ట్ టీవీ 75 ప్రత్యేకతలివే…

ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆధారంగా నోకియా స్మార్ట్ టీవీ 75-అంగుళాల మోడల్ 4 కే యుహెచ్‌డీ డిస్‌ప్లే ప్యానల్‌తో 3,840×2,160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌తో వస్తోంది. ఈ టీవీ రెండు 12 డబ్ల్యూ స్పీకర్లతో డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీని స‌పోర్ట్ చేస్తుంది. క్వాడ్-కోర్ ఆర్మ్ సీఏ55 ఎస్ ఓ సీ ప్రాసెస‌ర్‌ను ఇందులో వినియోగించారు. ఇది 1.5 జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది.

నోకియా స్మార్ట్ టీవీ 75-అంగుళాల మోడల్‌లో… వైర్‌లెస్ కనెక్టివిటీ విష‌యానికొస్తే వై-ఫై 802.11 బి / గ్రా / ఎన్, బ్లూటూత్ 4.2 ఉన్నాయి. నాలుగు హెచ్‌డీఎమ్‌ఐ, రెండు యుఎస్‌బీ 2.0, ఆప్టికల్ ఆడియో, వీజీఏ, ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. స్మార్ట్ టీవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ +, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌తో సహా ప‌లు యాప్‌ల‌తో పాటు గూగుల్ అసిస్టెంట్‌ను కూడా స‌పోర్ట్ చేస్తుంది.