ఆప్ఘనిస్తాన్‌లో కారు బాంబు దాడి.. 26 మంది ఆప్ఘన్ భద్రతా సిబ్బంది మృతి..జాబుల్ లోని ప్రావిన్షియల్ అధిపతే లక్ష్యంగా దాడి..
ఆఫ్ఘనిస్తాన్ యొక్క దక్షిణ జాబుల్ ప్రావిన్స్‌లో ఆదివారం కార్ బాంబు పేలింది. జాబుల్ లోని ప్రావిన్షియల్ కౌన్సిల్ అధిపతిని లక్ష్యంగా పెట్టుకొని ఈ దాడి జరిగింది. ఈ రోజు ఉదయం ప్రావిన్షియల్ కౌన్సిల్ అధిపతి అటా జాన్ హక్బయన్, కార్యాలయానికి వెళుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ఆఫ్ఘనిస్తాన్ యొక్క దక్షిణ జాబుల్ ప్రావిన్స్‌లో ఆదివారం కార్ బాంబు పేలింది. జాబుల్ లోని ప్రావిన్షియల్ కౌన్సిల్ అధిపతిని లక్ష్యంగా పెట్టుకొని ఈ దాడి జరిగింది. ఈ రోజు ఉదయం ప్రావిన్షియల్ కౌన్సిల్ అధిపతి అటా జాన్ హక్బయన్, కార్యాలయానికి వెళుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 34 మంది ఆప్ఘన్ భద్రతా సిబ్బంది మృతిచెందగా,17 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రాంతాల్లో తరచూ తాలిబన్లు, ప్రభుత్వ బలగాల మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతులకు సంబంధించిన సంఖ్యను ఘాజీ ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యుడు నాసిర్ అహ్మద్ వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వాహనాన్ని పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు. బామియన్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలు మరవక ముందే ఆదివారం ఘాజీలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాలో గత సెప్టెంబర్ 12న జరిగిన శాంతి చర్చల అనంతరం అఫ్గానిస్తాన్‌లో జరిగిన అతి పెద్ద బాంబు పేలుడు దాడి ఇదే.