Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ఈ ఏడాది పురస్కారం ఎవరికి దక్కిందంటే..
బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీతోపాటు.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ రష్యా, మెమోరియల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉక్రెయిన్

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించారు. నోబెల్ శాంతి బహుమతి 2022 ని బహుమతి బెలారస్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త, లాయర్, అలెస్ బైలియాట్ స్కీ తో పాటు రష్యా, ఉక్రెయిన్ మానవహక్కులకు సంఘాలకు లభించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్దం జరుగుతున్న సమయంలో శాంతికి కృషి చేస్తున్న వాళ్లకు ఈ బహుమతిని ప్రకటించారు. నోబెల్ శాంతి బహుమతి కోసం 343 మంది పోటీ పడ్డారు. కాని మానవహక్కుల సంఘాలకు ఈసారి బహుమతిని ప్రకటించారు.
బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీతోపాటు.. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ రష్యా, మెమోరియల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉక్రెయిన్, సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ (సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్) లకు 2022 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేశారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.




BREAKING NEWS: The Norwegian Nobel Committee has decided to award the 2022 #NobelPeacePrize to human rights advocate Ales Bialiatski from Belarus, the Russian human rights organisation Memorial and the Ukrainian human rights organisation Center for Civil Liberties. #NobelPrize pic.twitter.com/9YBdkJpDLU
— The Nobel Prize (@NobelPrize) October 7, 2022
ఆయా దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలపై ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, అదే విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి బహూకరించనున్నట్లు ఈ సందర్భంగా నోబెల్ కమిటీ వివరించింది.
ఈ శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నియంత్రించేందుకు కృషిచేశారని కమిటీ తెలిపింది. నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వాల అరాచకాలను ప్రశ్నించారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడం కోసం పాటుపడ్డారని పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..
