పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన కరిష్మా 15 తులాల బంగారం పోగొట్టుకోవడంతో భర్త ఆమెను, పసిబిడ్డను ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. కన్నవారు ఆదుకోలేదు. పోలీసులు 15 తులాలకు బదులు 3 తులాలకే కేసు నమోదు చేశారు. న్యాయం కోసం ప్రస్తుతం కరిష్మా తన భర్త ఇంటి ముందు నిరసన తెలుపుతోంది.
ప్రేమించాల్సిన భర్త వేధించాడు.. అండగా ఉండాల్సిన పుట్టినిల్లు మొహం చాటేసింది.. చివరకు న్యాయం చేయాల్సిన పోలీస్ స్టేషన్‌లోనూ చుక్కెదురైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరిష్మా అనే మహిళా కన్నీటి గాధ ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. కళ్యాణదుర్గంకు చెందిన కరిష్మా తన తల్లితో కలిసి ఓ శుభకార్యానికి కనేకల్ వెళ్తుండగా, మార్గమధ్యలో 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బాక్స్ పోగొట్టుకుంది. పోయిన బంగారం గురించి తన భర్త మహమ్మద్ గౌస్‌కు చెప్పగా, అతను కనికరం లేకుండా ప్రవర్తించాడు. “పోయిన బంగారం తిరిగి తెస్తేనే ఇంట్లోకి రానిస్తా.. లేదంటే నీకూ, నీ బిడ్డకూ నా ఇంట్లో చోటు లేదు” అంటూ తెగేసి చెప్పి భార్యను, మూడు నెలల పసికందును నడిరోడ్డుపై నిలబెట్టాడు. కరిష్మా ఫిర్యాదు చేసేందుకు కళ్యాణదుర్గం పోలీసులను ఆశ్రయించగా, ఘటన జరిగిన ప్రాంతం కనేకల్ కాబట్టి అక్కడికే వెళ్లాలని సూచించారు. కనేకల్ పోలీసులు మాత్రం 15 తులాల బంగారానికి బిల్లులు లేవని, కేవలం 3 తులాలకే కేసు నమోదు చేస్తామని చెప్పడంతో బాధితురాలు బెంబేలెత్తిపోయింది. అటు కన్నవారు కూడా ఆమెను అక్కున చేర్చుకోకపోవడంతో, మూడు నెలల పసిబిడ్డను ఎత్తుకుని తన భర్త ఇంటి ముందె బైఠాయించింది. వస్తువుల కోసం కట్టుకున్న భార్యను, పసికందును ఇలా వీధిపాలు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎక్కడో బంగారం పోతే, తన ఇల్లాలే దొంగ అన్నట్లుగా భర్త ప్రవర్తించడం విడ్డూరంగా ఉందని చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ??
మహిమల చెంబు.. మీ ఇంట ఉంటే సిరుల పంటే.. ఆలసించిన ఆశాభంగం
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
ప్రొజెక్టర్ రూమ్‌లో చనిపోతే.. దొంగచాటుగా పుట్‌పాత్‌పై పడేస్తారా ??
పోయిన బంగారంతో వస్తేనే ఇంట్లోకి రానిస్తా
మహిమల చెంబు.. మీ ఇంట ఉంటే సిరుల పంటే.. ఆలసించిన ఆశాభంగం
క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్ ప్లాన్ అదిరిందిగా
ఒక్కరోజు వయసున్న క్యూట్ 'రైనో'.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా
పెట్రోల్ బంకుల్లో ఎయిర్ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్

