కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ??
8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కనీస వేతనాన్ని రూ. 18,000 నుండి ఏకంగా రూ. 69,000కు పెంచాలని NC-JCM కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833కు పెంచాలని డిమాండ్ చేసింది. దీనివల్ల 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్‌లకు లబ్ధి చేకూరుతుంది. వార్షిక ఇంక్రిమెంట్, గ్రాట్యుటీ డిమాండ్లు కూడా ఉన్నాయి.
8వ వేతన సంఘం ఏర్పాటు తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల కనీస వేతనాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 18,000 నుండి ఏకంగా రూ. 69,000కు పెంచాలంటూ నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మేరకు 8వ పే కమిషన్‌కు సమర్పించిన మెమోరాండంలో ఈ డిమాండ్ ఉంచింది. సాధారణంగా వేతనాల పెంపు అనేది ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ పై ఆధారపడి ఉంటుంది. 7వ వేతన సంఘం సమయంలో ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉండటంతో కనీస వేతనం రూ. 7,000 నుండి రూ. 18,000కు పెరిగింది. అయితే ఇప్పుడు పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833కు పెంచాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇది గనుక ఆమోదం పొందితే, కనీస బేసిక్ పే దాదాపు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం జీతాల పెంపే కాకుండా మరికొన్ని కీలక అంశాలను NC-JCM ప్రతిపాదించింది. కనీస వేతనంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్ 6 శాతంగా ఉండాలని, ప్రమోషన్‌పై రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ఒక నెల వేతనాన్ని గ్రాట్యుటీగా అందించాలని కూడా NC-JCM కోరింది. ఈ మార్పులు అమలైతే, దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఇదిలా ఉండగా, 58 శాతం కరువు భత్యాన్ని (DA) బేసిక్ పేలో కలపాలని ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వాన్ని కోరుతోంది. 8వ పే కమిషన్ 2025 నవంబర్ నుంచి 18 నెలల్లోగా తన సిఫార్సులను ప్రభుత్వానికి అందిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గతంలో పార్లమెంటుకు తెలిపారు. దీంతో కమిషన్ సిఫార్సులపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిమల చెంబు.. మీ ఇంట ఉంటే సిరుల పంటే.. ఆలసించిన ఆశాభంగం
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
ప్రొజెక్టర్ రూమ్‌లో చనిపోతే.. దొంగచాటుగా పుట్‌పాత్‌పై పడేస్తారా ??
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్ ప్లాన్ అదిరిందిగా
ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో
మహిమల చెంబు.. మీ ఇంట ఉంటే సిరుల పంటే.. ఆలసించిన ఆశాభంగం
క్యాన్సర్‌ను ఎదిరించి.. CBSE టెన్త్‌లో టాపర్‌గా నిలిచి..
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్ ప్లాన్ అదిరిందిగా
ఒక్కరోజు వయసున్న క్యూట్ 'రైనో'.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో
ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా
పెట్రోల్ బంకుల్లో ఎయిర్ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్
పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

