Watch: మండే ఎండల్లో మంచు వర్షం.. ఈ ఆహ్లాదకర దృశ్యాన్ని చూశారా? ఎంత హాయిగా ఉందో..
ఎండలు మండిపోతున్నాయి.. వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో చాలా చోట్ల 40 కి పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. గత వారం పది రోజులుగా ఇదే పరిస్థితి. కట్‌చేస్తే శనివారం సాయంత్రం ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అల్లూరి ఏజెన్సీలో వాతావరణం ఒక్కసారి ఆహ్లాదాన్ని పంచింది. వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తూ నల్లటి మేఘాలు కమ్ముకొని చల్లటి గాలులతో వాన కురిపించింది. ఏకంగా వడగళ్ల వాన కురవడంతో.. ఏమి హాయిలే ఇలా అన్నారు జనం.

గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. పాడేరు ఏజెన్సీలో మాత్రం శనివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై చూస్తుండగానే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన విరుచుకుపడింది. ఆకాశం నుంచి రాలుతున్న మంచు ముక్కలు చూసి పర్యాటకులు పరవశించిపోయారు. వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్షణంలో చల్లని వాతావరణం పర్యాటకులకు ఎంతో ఉపశమనం కలిగించింది. భారీ వడగండ్ల వర్షంతో అరకు, పాడేరులోని పలు చోట్ల మంచు కుప్పలు పేరుకుపోయాయి. అరకులోయ రిసార్ట్ ల వద్ద.. పర్యాటకులు వర్షంలో తడుస్తూ, వడగళ్లతో ఆడుకుంటూ సందడి చేశారు.
విశాఖలోని ఏజెన్సీ ఏరియాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకే రోజు మూడు రకాల వాతావరణం దర్శనమివ్వడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. వేసవిలో ఎండలు మండుతున్న వేళ.. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వెదర్ ఆహ్లాదకరంగా మారుతోంది. ఒకే రోజులో ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన పడింది. దీంతో స్థానికులు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. మండే వేసవిలో కూల్ వెదర్‌ను అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
