AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్!

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 'ఇంప్రూవ్‌మెంట్'కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ 'బెటర్మెంట్'కు అనుమతి ఇచ్చినట్లైంది..

AP Inter Supply Exams 2026: ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్!
AP Inter improvement exams for 2nd year students
Sridhar Prasad
| Edited By: |

Updated on: Apr 18, 2026 | 6:16 PM

Share

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకూ పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటర్ విద్యార్థులకు మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ‘ఇంప్రూవ్‌మెంట్’కు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర హిస్టరీలోనే మొదటిసారిగా ద్వితీయ సంవత్సరంలోనూ ‘బెటర్మెంట్’కు అనుమతి ఇచ్చినట్లైంది. మార్చి 2026 పరీక్షల్లో పాస్ లేదా ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని తన ప్రకటనలో విద్యాశాఖ స్పష్టం చేసింది.

​సబ్జెక్టుల వారీగా ‘బెస్ట్ మార్క్స్’ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రాక్టికల్ పరీక్షలకు మాత్రం ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ అవకాశం ఉండదు. ప్రతి ఇంప్రూవ్‌మెంట్ పేపర్‌కు రూ. 160 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 20 (సోమవారం) నుంచి మొదలై ఏప్రిల్‌ 27వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతాయి. పాత రిజిస్ట్రేషన్ నంబర్‌తోనే దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ విద్యా మండలి సెక్రటరీ సూచించారు.

దీంతో ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధుల్లో ఎవరైనా ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాయాలనుకుంటే ఏప్రిల్ 20 నుంచి సంబంధిత సబ్జెక్ట్‌కు ఫీజు చెల్లించి రాయడానికి అవకాశం కల్పించారు. కాగా ఇంటర్‌లో తప్పిన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాసే విద్యార్ధులకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాయవల్సి ఉంటుంది. అంటే ఏ సబ్జెక్టులకైతే ఫీజు చెల్లిస్తారో.. ఆయా సబ్జెక్టులకు మాత్రమే సప్లిమెంటరీలో పరీక్షలకు హాజరవ్వవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us