AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

Phani CH
|

Updated on: Apr 18, 2026 | 10:55 AM

Share

పాకిస్థాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 331 మంది చిన్నారులు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. వాడిన సిరంజిలనే పదేపదే వాడటం, కలుషితమైన మందులు ఇవ్వడం బీబీసీ రహస్య విచారణలో బయటపడింది. వైద్యుల తప్పిదాల వల్ల ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఇంకొక చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఈ షాకింగ్ వాస్తవాలు ప్రపంచ ఆరోగ్య సంస్థలను ఉలిక్కిపడేలా చేశాయి.

ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది.. ఒకే సిరంజీని పదేపదే వాడటం వల్ల ఏకంగా 331 మంది చిన్నారులు ప్రాణాంతక హెచ్‌ఐవీ బారిన పడ్డారు. బీబీసీ చేపట్టిన రహస్య కెమెరాల విచారణలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలను ఉలిక్కిపడేలా చేసాయి. పాకిస్థాన్‌లోని టిహెచ్‌క్యూ ఆసుపత్రి టౌన్సాలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ వైఫల్యాలను తాజాగా బీబీసీ వెలుగులోకి తెచ్చింది. 2024 నవంబర్ నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో చిన్నారులకు హెచ్‌ఐవీ సోకడంపై స్ధానిక వైద్యుడు డాక్టర్ గుల్ కైస్రానీ అనుమానం వ్యక్తం చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో తేలిన గణాంకాల ప్రకారం.. కనీసం 331 మంది చిన్నారులు కేవలం ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో సుమారు 32 గంటల పాటు చిత్రీకరించిన రహస్య ఫుటేజీ ద్వారా సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వారంతా అత్యంత ప్రమాదకర పద్ధతులను పాటిస్తున్నట్లు బయటపడింది. ఒక రోగికి వాడిన సిరంజీనే తిరిగి మందు సీసాల్లో ముంచుతూ.. అదే మందును వేరే పిల్లలకు ఎక్కించడం కనిపించింది. దీని వల్లే అంత మంది పిల్లలకు హెచ్ఐవీ సోకి ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. ముఖ్యంగా సూది మార్చినా.. సిరంజీ వెనుక భాగంలో వైరస్ నిల్వ ఉంటుందని.. అది మొత్తం మందు బ్యాచ్‌ను కలుషితం చేస్తుందని వివరిస్తున్నారు. అలాగే వాడిన సూదులను కౌంటర్లపైనే వదిలేయడం, గ్లౌజులు లేకుండానే ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి ఘోర తప్పిదాలు కూడా ఆ రహస్య వీడియోల్లో వెలుగులోకి వచ్చాయి. హెచ్‌ఐవీ సోకడం వల్ల ఎనిమిదేళ్ల మహమ్మద్ అమీన్ ప్రాణాలు కోల్పోయాడు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన కొద్దిరోజులకే తీవ్ర జ్వరం, భరించలేని నొప్పితో చనిపోయాడు. అతని సోదరి ఆస్మా కూడా ఇప్పుడు అదే మహమ్మారితో పోరాడుతోంది. సాధారణ జ్వరానికి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే.. అక్కడ కలుషిత ఇంజెక్షన్ల ద్వారా తమ పిల్లలకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకిందని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.ఇంతటి బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ.. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఖాసిం బుజ్దార్ మాత్రం తమ తప్పు లేదని వాదిస్తున్నారు. ఆ వీడియోలు నకిలీవని.. ఎవరో కావాలని సృష్టించినవని కొట్టిపారేసారు. అయితే వైరాలజీ నిపుణులు మాత్రం ప్లాస్టిక్ సిరంజీలను పునర్వినియోగించడం వల్ల వైరస్ వ్యాప్తిని ఆపడం అసాధ్యమని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు.. వదిలేసి వెళ్లిన విమానం..

Follow Us