AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

Phani CH
|

Updated on: Apr 18, 2026 | 12:06 PM

Share

కోనసీమ జిల్లా మొండెపులంకలో ఒక పనస చెట్టు మామిడిని తలపిస్తూ గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అబ్బురపరుస్తోంది. సాధారణం కంటే రికార్డు స్థాయిలో కాయలు కాయడంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన వరంగా భావిస్తున్న ఈ చెట్టు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. పనస సీజన్‌లో అధిక డిమాండ్‌తో రైతుకు పండగ వాతావరణం నెలకొంది.

సాధారణంగా మామిడి చెట్టుకు కాయలు గుత్తులుగా కాయడం మనం చూస్తుంటాం. కానీ, కోనసీమ జిల్లాలో ఒక పనస చెట్టు ఏకంగా మామిడి చెట్టును తలపిస్తూ గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరినీ అబ్బురపరుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మొండెపులంకలో వెలిసిన ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. మొండెపులంక ప్రధాన పంటకాల్వ గట్టున ఉన్న ఒక పనస చెట్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కాయలు కాసింది. సాధారణంగా ఒక చెట్టుకు పది నుంచి ఇరవై కాయలు కాయడం సహజం. కానీ, ఈ చెట్టుకు మాత్రం కాండం మొదలు నుంచి కొమ్మల వరకు ఎక్కడ చూసినా పనస కాయలే కనిపిస్తున్నాయి. కొమ్మ కొమ్మకు గుత్తులుగా వేలాడుతున్న కాయలను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అటుగా వెళ్లే ప్రయాణికులు సైతం తమ వాహనాలను ఆపి మరీ ఈ పనసచెట్టును ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం పనస సీజన్ కావడంతో మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్ ఉంది. చెట్టు నిండా కాయలు విరగకాయడంతో సదరు రైతు పంట పండిందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. మునుపెన్నడూ ఇంతగా కాయలు కాసిన పనసచెట్టును చూడలేదని, ఇది నిజంగా ప్రకృతి ఇచ్చిన వరమే అంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పనస చెట్టు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లను సైతం కట్టిపడేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు

యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

Follow Us