AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

Phani CH
|

Updated on: Apr 18, 2026 | 11:53 AM

Share

పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక ఉగ్రవాదుల హత్యల పరంపర కొనసాగుతోంది. లష్కర్ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాతో పాటు అనేక మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు గత రెండేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. మోటార్‌సైకిళ్లపై వచ్చి దాడులు చేస్తున్న ఈ 'కిల్‌ ట్రయల్‌' ఉగ్రవాద నెట్‌వర్క్‌లలో కలకలం సృష్టిస్తోంది. ఈ రహస్య దాడుల వెనుక ఎవరున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక కలాపాలు చేస్తున్న ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడుల్లో ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు. తాజాగా లష్కర్-ఏ-తోయిబా సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో దాడి జరిగింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన అపరిచిత వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హమ్జా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు, మూడు సంవత్సరాలుగా పాక్‌లో ఉగ్రవాదుల “కిల్ ట్రయల్‌” నడుస్తోంది. కరాచీ నుంచి లాహోర్ వరకు ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దాడి చేసేవారు ఎక్కువగా మోటార్‌సైకిళ్లపై వచ్చి, పని పూర్తిచేసి కనుమరుగవుతున్నారు. గత రెండేళ్లుగా అనేక మంది కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అత్యధికులు భారత్ ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో ఉన్నవారే. ఏడు నెలల వ్యవధిలోనే ఏడుగురు ఉగ్రవాదులు మరణించడం కిల్‌ ట్రయల్‌ ట్రెండ్‌ సూచిస్తుంది. హతమైన వారిలో జైష్-ఏ-మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, ముజాహిదీన్ వంటి సంస్థల అగ్ర నాయకులు ఉన్నారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసి-814 హైజాకర్లలో ఒకడైన ఇబ్రాహీం, కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో చనిపోయాడు. 2016 పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి లతీఫ్, ఖలిస్తాన్ చీఫ్ పంజ్వార్‌ను లాహోర్‌లో కాల్చి చంపారు. 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడైన అబు ఖతాల్, ఫరూఖ్ కూడా ఈ “కిల్ ట్రైల్”కు బలయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లష్కర్ కమాండర్ షాహిద్‌ను కిడ్నాప్ చేసి, నియంత్రణ రేఖ వద్ద తల నరికిన స్థితిలో పడేశారు. యువతను రెచ్చగొట్టి కాశ్మీర్‌లోకి పంపే లష్కర్ రిక్రూటర్‌ ఘాజీని కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్ పోలీసుల ప్రతి దాడి తర్వాత “మోటార్‌సైకిల్‌పై వచ్చిన అపరిచితులు” ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెప్పడం మినహా, నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఉగ్రవాద కలాపాలకు కేంద్రంగా మారిన పాకిస్థాన్‌లో ఈ పరిణామాలు ఉగ్రవాద నెట్‌వర్క్‌లో కలకలం రేపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు

యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు

పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

Follow Us