AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు

ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు

Phani CH
|

Updated on: Apr 18, 2026 | 11:44 AM

Share

తణుకుకు చెందిన కవలలు విష్ణువర్ధన్, వర్షిణి ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో సరిగ్గా 463 మార్కులతో పాటు, ప్రతి సబ్జెక్టులోనూ ఒకే మార్కులు సాధించి ఆశ్చర్యపరిచారు. పేదరికం, ఆటో డ్రైవర్‌గా తండ్రి కష్టాలున్నా, వారి కృషి, ప్రతిభ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి. ఈ అరుదైన విజయం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

సాధారణంగా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువులో ఒకేలా రాణించడం అరుదు. ఒకరు చదువులో దూసుకెళ్తే..మరొకరు ఆటల్లోనో ఇంకోదానిలోనో యాక్టివ్‌గా ఉంటారు. చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. కానీ, కవలలుగా పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా చదవడమే కాకుండా, పబ్లిక్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు సాధించి టోటల్ స్కోర్‌ను కూడా సమానంగా తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు. తణుకు పట్టణానికి చెందిన కవలలు విష్ణువర్ధన్, వర్షిణి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు. పాలాటి నాగ వెంకట దుర్గాప్రసాద్, ఉమాదేవి దంపతుల కవల పిల్లలు విష్ణువర్ధన్, వర్షిణి. వీరిద్దరూ తణుకులోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో వీరిద్దరికీ సరిగ్గా 463 మార్కులు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే, కేవలం టోటల్ మార్కులే కాదు, ప్రతి సబ్జెక్టులోనూ ఇద్దరికీ ఒకే రకమైన మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హాల్ టికెట్ నంబర్లు వేరైనా, వీరి ప్రతిభ మాత్రం ఒక్కటేనని నిరూపించుకున్నారు. ఈ విజయాల వెనుక నిరుపేద తల్లిదండ్రుల కష్టం దాగి ఉంది. తండ్రి దుర్గాప్రసాద్ ఆటో డ్రైవర్‌గా పగలు రాత్రి కష్టపడుతూ, తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తపనతో.. రేకుల షెడ్డులో నివసిస్తున్నప్పటికీ, ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరి పెద్ద కుమారుడు కూడా పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనం నుండి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా విద్యాభ్యాసం చేస్తున్న ఈ కవలలు, భవిష్యత్తులో బీటెక్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. పదో తరగతిలో స్వల్ప తేడాతో మార్కులు సాధించిన వీరు, ఇంటర్‌లో మాత్రం అచ్చం ఒకేలా మార్కులు తెచ్చుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

ఒక్క సిరంజీతో 331 మంది జీవితాలు నాశనం..

ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు.. వదిలేసి వెళ్లిన విమానం..

Follow Us