జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్
పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్-అమెరికా ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు రవాణా నిలిచిపోయింది. ఇరాన్ కేవలం కొన్ని వేల డాలర్ల మ్యాన్‌ప్యాడ్స్‌తో అమెరికా లక్షల డాలర్ల యుద్ధ విమానాలను కూల్చివేస్తోంది. చైనా నుంచి అందిన ఈ చవకైన క్షిపణులు అమెరికా వైమానిక దళానికి పెద్ద సవాలుగా మారాయి, వారి వ్యూహాలను తలకిందులు చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు రవాణా నిలిచిపోయింది. 40 రోజుల పాటు కొనసాగిన యుద్ధం.. ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలికంగా నిలిచింది. అయితే, ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని ట్రంప్, ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇరాన్ యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలను సాధించలేదనేది స్పష్టమవుతోంది. అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. లక్షల డాలర్లు ఖర్చు చేసి తయారు చేసిన అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాలను, కేవలం కొన్ని వేల డాలర్లకే దొరికే చిన్న క్షిపణులతో కూల్చేస్తోంది. మ్యాన్‌ప్యాడ్స్‌గా పిలిచే ఈ భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులు ఇప్పుడు అమెరికా వైమానిక దళాలను ఇబ్బందిపెడుతున్నాయి. మ్యాన్‌ప్యాడ్స్ అంటే మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. వీటిని ఒక సాధారణ వ్యక్తి కూడా తన భుజంపై పెట్టుకుని సులువుగా ప్రయోగించవచ్చు. కేవలం 50 వేల డాలర్ల నుంచి 1.5 లక్షల డాలర్ల మధ్య ధర ఉండే ఈ క్షిపణులు… సుమారు 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే విమానాలను కూడా ధ్వంసం చేయగలవు. ధ్వని కంటే రెండు రెట్ల వేగంతో ప్రయాణిస్తూ, 3.2 మైళ్ల పరిధిలోని లక్ష్యాలను ఇవి ఛేదిస్తాయి. ఇరాన్ సుమారు 1,000కి పైగా ఇటువంటి క్షిపణులను చైనా నుంచి అందుకుంది. అమెరికాతో నేరుగా వివాదం రాకుండా ఉండేందుకు చైనా ఈ క్షిపణులను ఇతర దేశాల ద్వారా ఇరాన్‌కు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చవకైన అస్త్రాలతో ఇరాన్ ఇప్పటికే అమెరికా యుద్ధవిమానాలైన ఎఫ్-15ఈ, ఏ-10 ను కూల్చేసింది. ఈ క్షిపణులు చాలా చిన్నవిగా ఉండటంతో వీటిని గుర్తించడం అమెరికా సైన్యానికి కష్టంగా మారింది. ఒక కారు డిక్కీలో కూడా వీటిని దాచి, ఎక్కడికైనా తరలించవచ్చు. దీంతో, కోట్ల రూపాయల విలువైన అధునాతన టెక్నాలజీని ఎలా కాపాడుకోవాలో తెలియక అమెరికా తలపట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్.. కారణం ఇదే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

