తెలంగాణలో రాబోయే రెండు రోజులు వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి. కొన్ని చోట్ల తీవ్రమైన ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.