గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లి గుహల వద్ద ఆర్టీసీ, ప్రైవేటు కాలేజీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కాలేజీ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రాణనష్టం తృటిలో తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.