No Baby Boom In China: త్వరలో వృద్ధ కంట్రీగా మారనున్న చైనా.. ఇద్దరు పిల్లలను కనండీ అని మొత్తుకుంటున్న ప్రభుత్వం
పంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా.. రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభాను అదుపులో పెట్టేందుకు ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు అని చెప్పి.. 1970లో వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఆదేశంలో జననాల రేటు గణనీయంగా...
No Baby Boom In China: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా.. రోజురోజుకీ పెరిగిపోతున్న జనాభాను అదుపులో పెట్టేందుకు ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు అని చెప్పి.. 1970లో వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఆదేశంలో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. అంతేకాదు రానున్న కాలంలో యువకుల సంఖ్య మరీ తగ్గి.. వృద్ధుల సంఖ్య భారీగా పెరిగి వృద్ధ చైనా మారనున్నదనే లెక్కలు వినిపిస్తున్నాయి. దీంతో డ్రాగన్ కంట్రీ జననం సంఖ్య పెంచేందుకు 2016 లో నిబంధనలను సడలిస్తూ ఇద్దరు పిల్లలను కనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయినా చైనా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో మళ్ళీ ఇద్దరు పిల్లలను కనాలని మొత్తుకుంటోంది. 2020లో చైనాలో 10.04 మిలియన్ల జననాలు మాత్రమే నమోదుకాగా 2019 సంవత్సరంతో పోలిస్తే 30 శాతానికి తగ్గిపోయింది. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ లో చోటు చేసుకున్న పరిణామాలతో అక్కడ జీవన వ్యయం భారీగా పెరిగింది. దీంతో యువత పెళ్లిళ్లను, దంపతులు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకోవడం ప్రారంభించారు.
దీంతో తాజాగా అక్కడ పునరుత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పిల్లలను కనాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ఇక పిల్లలని కనమని ఏకంగా దక్షిణ కొరియా ప్రభుత్వం తల్లిదండ్రులకు మంచి మంచి బహుమతులను కూడా ప్రకటించింది.
Also Read: