AI Technology: అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం.. వ్యతిరేకిస్తున్న ప్రపంచ దేశాలు.. కారణమేంటంటే..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Feb 13, 2021 | 8:58 PM

Artificial Intelligence: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీ మంచికంటే..

AI Technology: అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం.. వ్యతిరేకిస్తున్న ప్రపంచ దేశాలు.. కారణమేంటంటే..
Follow us

Artificial Intelligence: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీ మంచికంటే.. విధ్వంసానికే ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఈ టెక్నాలజీని తమ రక్షణ రంగంలో వినియోగించేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మానవ రహిత యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలు, వాహనాలు, రోబోటిక్‌ మెషీన్‌ గన్లు వచ్చాయి. ప్రస్తుతం అది కాస్తా.. పూర్తిస్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారంగా ఆయుధాలు తయారు చేసే దిశగా ప్రపంచ దేశాలు కదులుతున్నాయి.

తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్‌వేర్ ద్వారా నడిచే స్వయంప్రతిపత్తిగత ఆయుధాల అభివృద్ధికి యునైటెడ్ స్టేట్స్‌ ప్రభుత్వం నియమించిన కమిటీ మద్దతు ఇచ్చింది. దీనికి ముందు.. గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ నేతృత్వంలోని ఈ కమిటీ జాతీయ భద్రత, ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడే అంశాలు, సాంకేతిక అభివృద్ధి కోసం రక్షణ శాఖలో ఏఐని వినియోగించడం వంటి అంశాలపై రెండు రోజులు పాటు దేశ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ప్రస్తుతం ఏఐ ఆధారంగా పని చేస్తున్న పాక్షిక ఆటోమేటెడ్ ఆయుధాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ, పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఆయుధాల తయారీపై అగ్రరాజ్యం అడుగులేస్తోంది. ఈ చర్యలే ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఆందోళన రేకెత్తిస్తోంది. కిల్లర్ రోబోట్‌లుగా పిలిచే ఈ ఆయుధాల వాడకాలన్ని ప్రపంచ వ్యాప్తంగా 30 ప్రధాన దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ప్రధాన దేశాలైన అమెరికా, రష్యా, చైనాలు మాత్రం తమ సైనిక శక్తిని పెంచుకునేందుకు ఏఐ ఆధారిత ఆయుధాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం తమ బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేస్తున్నారు. అయితే, ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాల వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చునని, మానవశక్తి నష్టం వాటిళ్లదని ఆయాదేశాలు వాదిస్తున్నాయి. అంతేకాదు.. యుద్ధ నేరాలను కూడా తగ్గించగలదని అమెరికా, రష్యా, చైనా దేశాలు చెబుతున్నాయి. అయితే, విమర్శకులు మాత్రం ఈ దేశాల దుందుడుకు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏఐ ఆధారంగా తయారు చేయబడ్డ ఆధాయుల వల్ల విధ్వంసమే ఎక్కువ అవుతుంది తప్ప.. ప్రయోజనం శూన్యం అని వాదిస్తున్నారు. మానవాళికి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

Also read:

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్టేల్‌పై 7.0 గా నమోదైన తీవ్రత..

Rohit Sharma: సరికొత్త రికార్డు నెలకొల్పిన హిట్‌మ్యాన్ రోహిత్.. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu