హమ్మయ్య అంతా సేఫ్.. నైజీరియాలో అపహరణకు గురైన 344 మంది విద్యార్థులు విడుదల…
పెద్ద గండం తప్పింది. ఉగ్రమూక చెరనుంచి అంతా సేఫ్‌గా వచ్చేశారు. నైజీరియాలో ఇటీవల అపహరణకు గురైన 344 మంది పాఠశాల విద్యార్థులను..
పెద్ద గండం తప్పింది. ఉగ్రమూక చెరనుంచి అంతా సేఫ్‌గా వచ్చేశారు. నైజీరియాలో ఇటీవల అపహరణకు గురైన 344 మంది పాఠశాల విద్యార్థులను మిలిటెంట్లు విడిచిపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా కత్సినా రాష్ట్ర గవర్నర్ అమిన్ బెల్లో వెల్లడించారు. అపహరణకు గురైన విద్యార్థులందరినీ క్షేమంగా భద్రతా అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. వారం రోజుల క్రితం వాయువ్య నైజీరియాలోని కాన్కరా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదాలు 344 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ సమయంలో నైజీరియన్ ఆర్మీకి, మిలిటెంట్లకు మధ్య చిన్నపాటి సంగ్రామమే జరిగింది. ఆ ఘర్షణ మధ్యనే విద్యార్థులను ఎత్తుకెళ్లారు. దాంతో అక్కడి ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. మిలిటెంట్లతో చర్చలు జరిపింది. ఎట్టకేలకు వారి చెర నుండి విద్యార్థులను విడిపించింది. విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావడంతో వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రేమికుల వరుస ఆత్మహత్యలు, తాజాగా జనగాం జిల్లాలో మైనర్ లవర్స్ సూసైడ్