AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit: వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక ఇంధన శక్తి మరింత మెరుగుపడుతుంది: బీసీ త్రిపాఠి

News9 Global Summit Germany: ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు 'వాతావరణ మార్పు'ను ఎదుర్కోవడం.. ఈ సమయంలో పునరుత్పాదక శక్తి ప్రధాన అవసరంగా ఉద్భవించింది. ఈ విషయంలో, భారతదేశం 'వన్ నేషన్ వన్ గ్రిడ్' విధానం దాని బలాన్ని ఎలా పెంచుకుందో ఏఎం గ్రీన్ వైస్ ఛైర్మన్ బిసీ త్రిపాటి వివరించారు.. ప్రధాని మోదీ విజన్ తో ఇంధన రంగంలో భారత్‌కు బలం చేకూర్చిందని తెలిపారు.

News9 Global Summit: వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో పునరుత్పాదక ఇంధన శక్తి మరింత మెరుగుపడుతుంది: బీసీ త్రిపాఠి
Am Green Vc Bc Tripathi
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2024 | 8:40 PM

Share

భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను మరింత బలోపేతంగా చేయడం లక్ష్యంగా న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌ .. జర్మనీ వేదికగా కొనసాగుతోంది.. స్టుట్‌గాట్‌ లోని MHP ఎరినా ఫుట్‌బాల్‌ స్టేడియం వేదికగా న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌ రెండో రోజు శుక్రవారం ప్రారంభమైంది.. టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సమ్మిట్ రెండో రోజు గ్రీన్ ఎనర్జీ విభాగంలో పనిచేస్తున్న ఏఎం గ్రీన్ కంపెనీ వైస్ చైర్మన్ బి.సి. త్రిపాఠి పాల్గొని మాట్లాడారు.. ఈ సమయంలో ప్రపంచం తన శక్తి అవసరాలను వేగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవడం అతిపెద్ద సవాలుగా మారినట్లు బీసి. త్రిపాఠి వివరించారు.

గ్రీన్ ఎనర్జీ గురించి నిర్వహించిన చర్చలో బీ. సి.త్రిపాఠి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రభావాలను ప్రపంచం మొత్తం గమనిస్తుందన్నారు. అటువంటి పరిస్థితిలో, శిలాజ శక్తి నుంచి పునరుత్పాదక శక్తికి మారవలసిన అవసరం ఉందని తెలిపారు. దీని ఆధారంగా, రాబోయే తరాలకు ఇంధన, ఆర్థిక వృద్ధి స్థిరమైన భవిష్యత్తును సిద్ధం చేయవచ్చంటూ వివరించారు.

‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ భారత్ బలాన్ని పెంచింది..

భారతదేశం ‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ విధానం గురించి కూడా బీసీ త్రిపాఠి ప్రస్తావించారు. కొన్ని సంవత్సరాల క్రితం, భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పునరుత్పాదక ఇంధనం నుంచి ఉత్పత్తి చేయబడిన ఇంధన వినియోగం.. నిల్వ సమస్య అని ఆయన అన్నారు. దీని తర్వాత, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ విజన్‌ను రూపొందించారని.. ఇది ఇంధన రంగంలో భారత్‌కు బలం చేకూర్చిందని తెలిపారు.

పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలిచే అవకాశం నేడు భారత్‌కు ఉందన్నారు. ఇది రాబోయే కాలంలో ఉపాధికి, ఆర్థిక వృద్ధికి శక్తిగా మారుతుందన్నారు. ఇది మాత్రమే కాకుండా, పునరుత్పాదక శక్తికి దేశం మారడం, దాని అవశ్యకతను వివరించారు. భారత ప్రభుత్వం కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో పరిశ్రమకు చాలా సహాయం చేసిందని.. విధాన నిర్ణేతలు, పరిశ్రమల మధ్య సహకారం పెరిగిందని తెలిపారు.

AM గ్రీన్ గురించి, కంపెనీ 15 సంవత్సరాల క్రితం డి-కార్బొనైజేషన్ ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఒకప్పుడు 20 మెగావాట్ల బయోగ్యాస్ ప్లాంట్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు.. నేడు కంపెనీ వివిధ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 10,000 MW కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తోందని తెలిపారు.

ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ..

మూడురోజుల పాటు జర్మనీలో జరిగే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశం, జర్మనీల మధ్య పెరుగుతున్న సహకారానికి సంకేతం. ప్రపంచ స్థాయిలో సమ్మిట్ ను నిర్వహించిన మొదటి భారత మీడియా హౌస్ గా టీవీ9 నెట్ వర్క్ అవతరించింది.. ఈ సదస్సులో భారత కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొంటున్నారు.

మరిన్ని న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?