Telugu News World Nasa video check mesmerising view of jupiter clouds taken at 210000 kmph by juno
NASA Releases Stunning Video: నాసా అద్భుత వీడియో..! మేఘాల గుండా వెళ్తోన్న గురు గ్రహం..
సౌరమండలంలో అతిపెద్దదైన గురుగ్రహం మేఘాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించరా..? లేదు కదా..? కానీ, బృహస్పత్రిపై ఉన్న క్లౌడ్ టాప్స్‌ని దగ్గరగా చూసే అవకాశం కల్పించింది NASA...బృహస్పతికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోని రిలీజ్ చేసింది.
సౌరమండలంలో అతిపెద్దదైన గురుగ్రహం మేఘాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఊహించరా..? లేదు కదా..? కానీ, బృహస్పత్రిపై ఉన్న క్లౌడ్ టాప్స్‌ని దగ్గరగా చూసే అవకాశం కల్పించింది NASA…అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA బృహస్పతికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోని రిలీజ్ చేసింది. గంటకు రెండు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే జూనో స్పేస్‌క్రాఫ్ట్ ఈ వీడియోను చిత్రీకరించింది. జూనో మిషన్‌కు చెందిన కెమెరాలు ఏప్రిల్ 9వ తేదీన సుమారు 32000 కిలోమీటర్ల దూరం నుంచి గురుగ్రహాన్ని షూట్ చేశాయి. బృహస్పతికి చెందిన దక్షిణ ద్రువాన్ని ఈ వీడియోలో షూట్ చేశారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో గురుగ్రహానికి మరింత దగ్గరగా జూనో వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2011 ఆగస్టులో జూనో స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగికి పంపారు. 2025 వరకు ఈ మిషన్ పనిచేయనున్నది.