AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My father has 27 wives, 150 children: ఆయనకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27మంది భార్యలు, 150 మంది పిల్లలు..

ప్రస్తుతం మనిషికి పెరుగుతున్న అవసరాలు.. తగ్గట్లుగా ఈ రోజుల్లో ఎక్కడ ఏ దేశంలో నైనా ఎక్కువమంది కుటుంబ సభ్యులుంటే ఒక వ్యక్తి వారిని పెంచి పోషించడం అతి కష్టం.. అయితే ఓ వ్యక్తి చట్టానికి తెలియకుండా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 27మంది ని పెళ్లి...

My father has 27 wives, 150 children: ఆయనకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27మంది భార్యలు, 150 మంది పిల్లలు..
Surya Kala
|

Updated on: Jan 25, 2021 | 5:02 PM

Share

My father has 27 wives, 150 children: ప్రస్తుతం మనిషికి పెరుగుతున్న అవసరాలు.. తగ్గట్లుగా ఈ రోజుల్లో ఎక్కడ ఏ దేశంలో నైనా ఎక్కువమంది కుటుంబ సభ్యులుంటే ఒక వ్యక్తి వారిని పెంచి పోషించడం అతి కష్టం.. అయితే ఓ వ్యక్తి చట్టానికి తెలియకుండా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 27మంది ని పెళ్లి చేసుకున్నాడు. ఇక 150మంది పిల్లల్ని కన్నాడు. వారు పెరిగి పెద్దయ్యారు కూడా.. అయితే తన తండ్రికి ఎన్ని పెళ్లిళ్లు.. ఎంతమందో పిల్లలో తెలుసా అంటూ అతని కొడుకు లోకానికి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఈ విష‌యాన్ని త‌న తండ్రి ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచ‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని.. ఇప్పటికైనా ఈ విషయం అందరికీ తెలియజేయాల్సిన సమయం వచ్చిందని ఆ కుర్రాడు టిక్ టాక్ ద్వారా వెల్ల‌డించాడు. మరి 27 మంది భార్యల ముద్దుల మొగుడు ఎవరో వివరాల్లోకి వెళ్తే..

బ్రిటీష్‌ కొలంబియాకు చెందిన మెర్లిన్‌ బ్లాక్‌మోర్(19)‌ తమది చాలా పెద్ద కుటుంబమని చెప్పాడు. ఫ్యామిలీలో సుమారు 160 మందికి పైగా సభ్యులు ఉంటామని.. తన తండ్రి విన్‌స్టన్‌ బ్లాక్‌మోర్‌కు త‌న త‌ల్లి కాకుండా మ‌రో 26 మంది భార్యలున్నార‌ని చెప్పాడు. తనకు మొత్తం 149 మంది తోబుట్టువులు ఉన్న‌ట్టు చెప్పాడు. అయితే త‌మ క‌జిన్స్ అంతా త‌మ త‌ల్లుల‌తో కాకుండా వేరేగా “మోటెల్ హౌస్” లో ఉండేవార‌మ‌ని.. అంతా క‌లిసి స్కూల్ కు వెళ్లేవారమ‌ని మెర్లిన్‌ బ్లాక్‌మోర్ చెప్పాడు.

తాను ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నానని.. గత మూడేళ్లుగా తండ్రి విన్‌స్టన్‌తో సంబంధాలు లేవన్నాడు. అయితే తోడబుట్టిన వాళ్లతో మాత్రం ఇప్పటికీ టచ్‌లో ఉంటామ‌ని తెలిపాడు మెర్లిన్. వీలు చిక్కినప్పుడల్లా అంతా ఒక్కచోట చేరి వేడుక జరుపుకోవడం తమకు అలవాటు అంటున్నాడు మెర్లిన్‌. అయితే తనకు మర్రే, వారెన్‌ అనే ఇద్దరు సోదరులు ఉన్నారని .. తమ కుటుంబంలో కన్నతల్లిని మామ్‌ అని, సవతి తల్లులను మదర్‌(వారిఫస్ట్‌నేమ్‌ జతకలిపి) అని పిలుస్తామంటూ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా కుటుంబ విషయాలని అందరితోనూ పంచుకున్నాడు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన మెర్లిన్‌, తన కుటుంబం గురించి రహస్యాన్ని ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా బహిర్గతం చేశాడు.స్థానిక చట్టాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నందుకు గానూ విన్‌స్టన్‌(64)పై కేసు నమోదైంది. ఆరునెలల పాటు ఆయనకు గృహ నిర్బంధం విధించారు.

Also Read: షికారుకు వెళ్లి అడవిలో తప్పిపోయిన రాజకీయ నేత.. 18 రోజులపాటు ప్రాణం కోసం ఆకలితో పోరాటం