భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కరోనాపై కలిసి పోరాడుదామని పిలుపు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కరోనాపై కలిసి పోరాడుదామని పిలుపు
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 26, 2021 | 9:18 AM

Boris Johnson greets india  : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు. భారతప్రజలందరికీ అభినందనలు తెలిపిన ఆయన.. కరోనా వైరస్ మహమ్మారిని మానవాళి నుంచి దూరం చేసేందుకు యూకే – భారతదేశం సమన్వయం పనిచేయాలని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్ సహకారంలో భారతదేశం యూకే కలిసి పనిచేస్తున్నాయని బోరిస్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సార్వభౌమ ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో అసాధారణ రాజ్యాంగం పుట్టిన రోజు సందర్భంగా బోరిస్ వీడియో సందేశం ఇచ్చారు. నా స్నేహితుడు ప్రధాన మంత్రి మోదీ ఆహ్వానం మేరకు ఈ ముఖ్యమైన సందర్భంలో మిమ్మల్ని కలవాలని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను, కాని కొవిడ్‌ నన్ను లండన్‌లోనే ఉంచిందంటూ జాన్సన్ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది భారత ప్రభుత్వం. అయితే కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు యూకే ప్రధాని. కాగా, ఈ ఏడాది చివరిలో నేను భారతదేశాన్ని సందర్శించి స్నేహాన్ని బలోపేతం చేస్తానని బోరిస్ వివరించారు.

Read Also.. దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవం.. యావత్ భారతావనికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ