Gold & Silver Prices: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. దేశీయ మార్కెట్లో రేట్లు ఇలా ఉన్నాయి..
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పులు లేకుండాల మంగళవారం స్థిరంగా
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పులు లేకుండాల మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,330 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,330కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో పుత్తడి ధరలో ఎలాంటి మార్పులు జరగలేదు. మంగళవారం నాడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,120 దగ్గర ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.45,940 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,120కు చేరింది.
వెండి కూడా బంగారం బాటలో పయనిస్తుంది. సోమవారంతో పోలీస్తే వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.66,700 దగ్గర ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కిలో వెండి ధర రూ. 71,300 దగ్గర కొనసాగుతుంది.
Also Read: Today Gold Rates : నేడు ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…