Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Rates : నేడు ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…

బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,940 వద్దనే ఉంది.

Today Gold Rates : నేడు ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి...
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 28, 2020 | 5:40 PM

బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,940 వద్దనే ఉంది. అదే క్రమంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 వద్ద నిలకడగా కొనసాగుతోంది. బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. వెండి ధర కేజీ రూ.71,200 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందకొడిగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

వరంగల్‌లో బంగారం, వెండి ధరలు నేడు ఇలా ఉన్నాయి….

నేడు వరంగల్‌లో 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 47,300గా ఉంది. 22 క్యారెట్ల పసడి ధర  49, 670 గా ఉంది. మరోవైపు కేజీ వెండి ధర రూ..  71,200 గా ఉంది.

విజయవాడలో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి….

విజయవాడలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ 47,100 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,280గా ఉంది. ఇక విజయవాడలో కేజీ వెండి ధర 72,600గా ఉంది.

ప్రోద్దుటూర్‌లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…

నేడు ప్రొద్దుటూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 47,300గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,670గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 71,200 గా ఉంది.

ఇకపోతే బంగారం ధరలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి.  గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు,  వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాల ప్రభావంతో పసిడి ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

Also Read :

Yerragondapalem jr ntr flex : “ఏపీకి నెక్ట్స్ సీఎం తారక రామారావే”..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫ్లెక్సీ

 Tiruchanur railway station : శ్రీవారి చెంత మరో రైల్వే స్టేషన్.. ‘బి’ క్లాస్ స్టేషన్‌గా‌ తిరుచానూరు..సకల సౌకర్యాలతో భవనం