డిజిటల్ ఆధార్ వచ్చేసింది.. ఇక నో కార్డ్.. నో జిరాక్స్
ఆధార్ కార్డకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త అప్‌డేట్ ఇచ్చేశారు. ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డునో లేక దాని జిరాక్స్ కాపీనో మనం వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఇక ఉండదు. గుర్తింపు ధ్రువీకరణను సురక్షితంగా, డిజిటల్‌గా, పేపర్ రహితంగా చేయడానికి రూపొందించిన ఆధార్ యాప్‌ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
క్యూఆర్ కోడ్‌తో తక్షణ వెరిఫికేషన్, రియల్ టైం ముఖ ధ్రువీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. 100 శాతం డిజిటల్ విధానంలో పనిచేస్తుంది కాబట్టి ఇక నుంచి వినియోగదారులు ఆధార్ ఫొటో కాపీలు, ప్లాస్టిక్ కార్డులు తమ వెంట తీసుకుని వెళ్లనక్కర్లేదు. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ యాప్‌ను త్వరలోనే దేశమంతటా ప్రవేశపెడతారు. ఇది అమలులోకి వస్తే ఇక నుంచి ఎయిర్‌పోర్టులు, హోటళ్లు, ప్రభుత్వ సేవలు, ఇతర ప్రదేశాల్లో భౌతిక ఆధార్ కార్డులను ఐడీ ధ్రువీకరణగా చూపించాల్సిన అవసరం ఉండదు. స్కానింగ్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణమే ఆధార్ ధ్రువీకరించుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్లో ప్రయాణికుల నుంచి ఫోన్ కొట్టేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
బురదలో సేదతీరుతున్న దున్నపోతు.. వీపుపై తట్టిలేపిన సింహం
ఇకపై మీ ఇంటికే పెట్రోల్.. బంకుల దగ్గర క్యూ అక్కర్లేదు..
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడి.. పాపం చివరికి
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్..
పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..
అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

