Tiruchanur railway station : శ్రీవారి చెంత మరో రైల్వే స్టేషన్.. ‘బి’ క్లాస్ స్టేషన్‌గా తిరుచానూరు..సకల సౌకర్యాలతో భవనం
తిరుపతి తిరునగరికి సమీపంలో మరో రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. ఎప్పుడూ కిక్కిరిసే తిరుపతి స్టేషన్‌పై రద్దీ తగ్గనుంది. పద్మావతీ అమ్మవారి నిలయమైన తిరుచానూరు పేరిట

తిరుపతి తిరునగరికి సమీపంలో మరో రైల్వేస్టేషన్ అందుబాటులోకి రానుంది. ఎప్పుడూ కిక్కిరిసే తిరుపతి స్టేషన్‌పై రద్దీ తగ్గనుంది. పద్మావతీ అమ్మవారి నిలయమైన తిరుచానూరు పేరిట తిరుపతి – రేణిగుంట మధ్య క్రాసింగ్ స్టేషన్‌ను తాజాగా అప్‌గ్రేడ్ చేశారు. గతంలో ఈ స్టేషన్ కేవలం హాల్ట్ స్టేషన్‌గా ఉండేది. రైళ్ల రాకపోకలకు క్రాసింగ్ లేదు. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు జరిగేందుకు వీలుగా అభివృద్ధి చేయడానికి 2016 – 17 సంవత్సరంలో రైల్వే శాఖ నిధులు మంజూరు చేసింది. ఫస్ట్ ఫేజ్‌లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేశారు. ట్రైన్ సర్వీసెస్‌కు పెద్దగా ఇబ్బంది లేకుండా 8 రోజుల వ్యవధిలోనే ఇంటర్ లాకింగ్ పనులను విజయవంతంగా కంప్లీట్ చేశారు. తాజాగా తిరుచానూరు స్టేషన్‌ను ‘బి’ క్లాస్‌గా గుర్తించడంతో తిరుపతి స్టేషన్‌పై రద్దీ తగ్గే అవకాశం ఉంది.
ఈ స్టేషన్‌లో మౌలిక సదుపాయాల కోసం రైల్వే శాఖ రూ.33 కోట్లు కేటాయించింది. దాంతో రెండు మెయిన్, రెండు లూప్ లైన్లను ఏర్పాటు చేశారు. ఇందులోని మూడు లైన్లను ప్యాసింజర్ రైళ్లు ఆపడానికి వీలుగా నిర్మించారు. 48 సిగ్నల్ రూట్లతో కొత్త ప్యానెల్, 19 పాయింట్లతో క్రాసింగ్స్ ఏర్పాటు చేశారు. తిరుపతి- తిరుచానూరు స్టేషన్ మధ్య ప్రతిపాదిత 3వ లైనుకు కనెక్టవిటీ సౌకర్యం కల్పించారు. ప్లాట్‌ఫారం లైన్ల వద్ద ప్రస్తుతం పైకప్పు ఏర్పాటు చేస్తున్నారు. సకల సౌకర్యాలతో స్టేషన్ భవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. 1, 2, 3 ప్లాట్‌ఫామ్‌లను కలుపుతూ రెండు అండర్‌పాస్ మార్గాలు అందుబాటులోకి తేనున్నారు.
Also Read : ICC Rankings: టీమిండియా సారథికి అరుదైన గౌవరం.. ఈ దశాబ్దపు ఐసీసీ వన్డే క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ..