కొత్త తరహా వాహనాలపై మహేంద్రా లాజిస్ట్రిక్స్ ఫోకస్..డెలివరీలు అందించేందుకు వీలుగా విద్యుత్ వాహనాలు
కొత్త తరహా వాహనాలపై మహేంద్రా లాజిస్ట్రిక్స్ ఫోకస్ పెట్టింది. వినియోగదారులకు డెలివరీలు అందించేందుకు వీలుగా విద్యుత్ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపింది. 2025-26 నాటికి...

Mahindra Logistics : కొత్త తరహా వాహనాలపై మహేంద్రా లాజిస్ట్రిక్స్ ఫోకస్ పెట్టింది. వినియోగదారులకు డెలివరీలు అందించేందుకు వీలుగా విద్యుత్ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపింది. 2025-26 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తమ కొనుగోలుదార్లకు వస్తువుల సరఫరాకు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం మహీంద్రా ఎలక్ట్రిక్, కైనెటిక్ గ్రీన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.
ఫర్నీచర్ రిటైలర్ ఐకియా, గ్రోసరీల సంస్థ బిగ్‌బాస్కెట్ కూడా ఉత్పత్తుల సరఫరాకు విద్యుత్ వాహనాల వినియోగానికి సిద్ధమవుతున్న తరుణంలో మహీంద్రా లాజిస్టిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కంపెనీ చేతిలో 16 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఉంది. ఒక్క మూడో త్రైమాసికంలోనే హైదరాబాద్, చెన్నైల్లో 0.75 మి.చదరపు అడుగుల స్థలాన్ని పెంచుకుంది. కొత్త సేవలు ప్రారంభించడం, ప్రస్తుత విభాగాల సామర్థ్యం పెంచనున్నట్లు తెలుస్తోంది.