AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆ ముగ్గురు దర్శకులు.. మహేష్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో మరి…

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది అనీల్ రావిపూడి డైరెక్షన్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు.

సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆ ముగ్గురు దర్శకులు.. మహేష్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో మరి...
Rajeev Rayala
|

Updated on: Dec 28, 2020 | 5:01 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది అనీల్ రావిపూడి డైరెక్షన్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారిపాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇక ఆ మధ్య విడుదలైన ప్రీలుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ మెడ పైన ఉన్న రూపాయి ట్యాటూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేయబోతున్నడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సూపర్ స్టార్ తో సినిమా తెరకెక్కించాలని ఇప్పటికే చాలామంది దర్శకులు క్యూలో ఉన్నారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వంటి దర్శకులు మహేష్ తో సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ తో సినిమా చేయడానికి మరో ముగ్గురు దర్శకులు కుడా సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. వారిలో మహేష్ తో గతంలో ‘ఒక్కడు’ లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన గుణ శేఖర్ ఎప్పటినుంచో మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రెండు భారీ సినిమాలు చేస్తున్న గుణ శేఖర్ ఎలాగైనా మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నడు. ఇక మహేష్ ను ‘పోకిరి’ సినిమాతో మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసిన పూరిజగన్నాథ్. మహేష్ తో ‘జనగణమణ’ అనే సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అలాగే ‘దూకుడు’ సినిమాతో మహేష్ కెరియర్ లో మరో సూపర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల. ‘దూకుడు’ సీక్వెల్ చేయాలని చూస్తున్నాడు. ఈ ముగ్గురు మరో సారి మహేష్ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ మాత్రం ఈ ముగ్గురు కథలు వినేంత గ్యాప్ కుడా లేనంత బిజీగా ఉన్నాడు. మరి ఈ దర్శకుల్లో మహేష్ ను మెప్పించి ఎవరు సినిమా చేస్తారో చూడాలి.

Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!