CSIR Survey : శాకాహారుల్లో కోవిడ్ వ్యాప్తి తక్కువే.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు..
CSIR Survey On Covid 19: ఆహారపు అలవాట్లు, బ్లడ్ గ్రూప్‌ల బట్టి కోవిడ్ వ్యాప్తిని అంచనా వేయగలమా.? మాంసాహారుల కంటే శాకాహారుల్లో కరోనా పాజిటివ్..
CSIR Survey On Covid 19: ఆహారపు అలవాట్లు, బ్లడ్ గ్రూప్‌ల బట్టి కోవిడ్ వ్యాప్తిని అంచనా వేయగలమా.? మాంసాహారుల కంటే శాకాహారుల్లో కరోనా పాజిటివ్ రేటు తక్కువగా ఉంటుందా.? ఈ ప్రశ్నలకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) సమాధానమిస్తోంది. తాజాగా దేశంలోని 17 నగరాల్లో చేసిన CSIR సర్వేలో కోవిడ్ వ్యాప్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 10,427 మందిపై యాంటీబాడీ పరీక్షలు నిర్వహించగా.. అప్పటికే 10 శాతం మంది కోవిడ్ బారినపడినట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు.
కోవిడ్ వ్యాప్తి శాకాహారుల్లో 6.8 శాతం.. మాంసాహారుల్లో 11 శాతం వరకూ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. ఇక సొంత వాహనాల్లో ప్రయాణించేవారితో పోలిస్తే.. నలుగురైదుగురు కలిసి ఒక వాహనంలో వెళ్లేవారిలోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. ఇక బ్లడ్ గ్రూప్‌ల వారీగా చేసిన అధ్యయనం.. ‘o’ బ్లడ్ గ్రూప్ వారిలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని.. ‘A’ గ్రూప్ వారిలో పాజిటివ్ రేట్ అధికంగా ఉందని.. ‘బీ’, ‘ఏబీ’ గ్రూప్‌లలో మధ్యస్థంగా వైరస్ వ్యాప్తి ఉంటుందని తేలింది.