Australian Man Missing: షికారుకు వెళ్లి అడవిలో తప్పిపోయిన రాజకీయ నేత.. 18 రోజులపాటు ప్రాణం కోసం ఆకలితో పోరాటం

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు అని పెద్దల మాట... ఈ మాటను నిజం చేశాడు ఓ రాజకీయనేత.. అడవిలో దారి తప్పిపోయి.. ఆకలిని తట్టుకోలేక పుట్టగొడుగులు తింటూ నీరు తాగుతూ ప్రాణాలను...

Australian Man Missing: షికారుకు వెళ్లి అడవిలో తప్పిపోయిన రాజకీయ నేత.. 18 రోజులపాటు ప్రాణం కోసం ఆకలితో పోరాటం
Follow us

|

Updated on: Jan 25, 2021 | 2:08 PM

Australian Man Missing: ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు అని పెద్దల మాట… ఈ మాటను నిజం చేశాడు ఓ రాజకీయనేత.. అడవిలో దారి తప్పిపోయి.. ఆకలిని తట్టుకోలేక పుట్టగొడుగులు తింటూ నీరు తాగుతూ ప్రాణాలను నిలబెట్టుకున్నాడు.. ఈ ఘటన ఆస్టేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఆస్ట్రేలియాకు చెందిన రాబర్ట్ వెబర్ (58) అనే స్థానిక రాజకీయ నేత ఇటీవల కిల్కివాన్ అనే పట్టణంలోని ఓ హోటల్ లో బస చేశాడు. ఓ రోజు తన కుక్కని తీసుకుని షికారు నిమిత్తం కారులో అడవికి వెళ్ళాడు. అక్కడ ఓ ప్రదేశంలో అతని కారు బురదలో కూరుకుపోయింది. రాబర్ట్ కారుని బురద నుంచి బయటకు తీసేందుకు విశ్వప్రయత్నం చేశాడు.. కానీ బురద నుంచి కారు బయటకు రాలేదు. దీంతో అతను తనను ఎవరైనా వెదుక్కుంటూ వస్తారేమో అని ఆ కారులోనే మూడు రోజులు గడిపాడు.. అనంతరం ఆకలి బాధను తట్టుకోలేక కారుని అక్కడే వదిలి హోటల్ కు వెళ్ళడానికి ముందుకు నడిచాడు. అయితే అడవిలో అతనికి దారితెన్నూ కనిపించలేదు.. దీంతో ఓ చోట ఓ డ్యామ్ కనిపించడంతో అక్కడే ఉంటూ పుట్టగొడుగులు తింటూ, నీళ్లు తాగుతూ 18 రోజులు గడిపాడు.

మరోవైపు రాబర్ట్ వెబర్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారీస్థాయిలో గాలించారు. అతని జాడ తెలియక పోవడంతో ఏమి చెయ్యాలో దిక్కుతోచక తమ వల్ల కాదని గాలింపు నిలిపివేశారు. అయితే స్థానిక ఎంపి టోనీ పెరెట్ దంపతులు వెబర్‌ను ఆదివారం గుర్తించారు. డ్యామ్ వద్ద ఉన్న ఓ చెట్టు కింద కుర్చీని ఉన్న వెబర్ ను గుర్తుపట్టి పోలీసులకు తెలిపారు. అయితే అతని కుక్క జాడ మాత్రం ఇంకా తెలియలేదు.

Also Read: ఓవైపు పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు.. మరోవైపు కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు