AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jai Shankar In Srilanka: శ్రీలంక పర్యటనలో మంత్రి బిజిబిజీ.. భారత్‌కు విశ్వసనీయమైన మిత్రదేశమని స్పష్టం..

రెండో రోజు శ్రీలంక విదేశాంగ మంత్రి దినేష్‌ గుణవర్ధనె తో జై శంకర్ సమావేశమయ్యారు... శ్రీలంక భారత్ కు నమ్మదగిన నేస్తమన్న జై శంకర్.. కరోనా నుంచి కోలుకునే వరకూ ఆ దేశానికి అండగా ఉంటామని హామీ

Jai Shankar In Srilanka: శ్రీలంక పర్యటనలో మంత్రి బిజిబిజీ.. భారత్‌కు విశ్వసనీయమైన మిత్రదేశమని స్పష్టం..
Surya Kala
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 06, 2021 | 9:43 PM

Share

Jai Shankar In Srilanka: ఈ ఏడాదిలో మొదటిసారిగా విదేశాంగ మంత్రి జై శంకర్‌ విదేశీ పర్యటన చేపట్టారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక చేరుకున్న జై శంకర్ అక్కడ మంత్రులతో అధికారులతో సమావేశమవతు బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా రెండో రోజు శ్రీలంక విదేశాంగ మంత్రి దినేష్‌ గుణవర్ధనె తో జై శంకర్ సమావేశమయ్యారు. కరోనా నుంచి శ్రీలంక కోలుకునే వరకూ భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు కలిసి పనిచేయాలని శ్రీలంక సామరస్య, సయోథ్య క్రమానికి భారత్‌ పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు.

శ్రీలంకకు భారత్‌ ఎప్పుడూ నమ్మదగిన నేస్తమని.. విశ్వసనీయమైన మిత్రదేశమేనని జై శంకర్ స్పష్టం చేశారు. ఇరుదేశాలు పరస్పర విశ్వాసం, ప్రయోజనాలు, గౌరవం, సున్నితత్వం ప్రాతిపదికన శ్రీలంకతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము సిద్ధంగా వుంటామన్నారు. “సమానత్వం, న్యాయం, శాంతి, ఐక్య శ్రీలంకలో గౌరవం పట్ల తమిళ మైనారిటీలకు గల ఆకాంక్షలను నెరవేర్చేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జైశంకర్‌ కోరారు. రాజ్యాంగంలోని 13వ సవరణతో పాటు అర్ధవంతమైన రీతిలో అధికారాల వికేంద్రీకరణపై శ్రీలంక ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనే భాగంలో అధికార వికేంద్రీకరణ తప్పని సరన్నారు.

Also Read: బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసుః మాజీ మంత్రి అఖిలప్రియకు14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ మహిళా జైలుకు తరలింపు