AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Embassy Suspends Services: బ్రిటన్‌లో కొనసాగుతున్న కరోనా వైరస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ ఎంబసీ

ఫిబ్రవరి 20 వరకు అన్ని రకాల కాన్సులర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు యూకేలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రకటించింది.

Indian Embassy Suspends Services: బ్రిటన్‌లో కొనసాగుతున్న కరోనా వైరస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ ఎంబసీ
Balaraju Goud
|

Updated on: Jan 06, 2021 | 8:21 PM

Share

Indian Embassy Suspends All Consular Services: బ్రిటన్‌లో కరోనా వైరస్‌కు తోడు కొత్త రకం వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన బ్రిటన్ సర్కార్ ఇప్పటికే మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా ఫిబ్రవరి నెల మధ్య వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకేలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 20 వరకు అన్ని రకాల కాన్సులర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కొవిడ్-19 ఉధృతి తీవ్రంగా ఉండటం, కొత్త రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనే వార్తల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కాగా.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిటన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 27.82లక్షల మంది కొవిడ్ బారినపడ్డారు. కాగా, కరోనా వైరస్ బారినపడి 76వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నిత్యం వేలాదిగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వీటితో పాటు కొత్త రకం స్ట్రెయిన్ కేసులు కూడా నిర్థారణ అవుతున్నాయి. అన్ని రకాల కాన్సులర్ సర్వీసులను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ

ఇదీ చదవండి…. BSF On High Alert: దేశ సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాదులు.. నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమై బీఎస్ఎఫ్ బలగాలు..