Akkineni Nagachaithanya: ఆ సినిమా కోసం సమంతకు నో చెప్పిన నాగచైతన్య.. ఏ మూవీ అంటే ?

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమా సూపర్ హిట్ సాధించింది. దీంతో మరోసారి జోడితో కలిసి సినిమాను

Akkineni Nagachaithanya: ఆ సినిమా కోసం సమంతకు నో చెప్పిన నాగచైతన్య.. ఏ మూవీ అంటే ?
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 06, 2021 | 8:23 PM

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ సినిమా సూపర్ హిట్ సాధించింది. దీంతో మరోసారి జోడితో కలిసి  సినిమాను రూపొందించాలని ఓ డైరెక్టర్ భావించాడట. కానీ ఆ సినిమాలో సమంత నటించేందుకు చైతూ నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ. మనం ఫేం విక్రమ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అబిడ్స్‏లోని రామకృష్ణ సినిమా హాల్లో జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా.. ఒక హీరోయిన్ రోల్ కోసం సమంతని తీసుకుందామని దర్శకుడు భావించడట. అదే విషయమై నాగ చైతన్యను సంప్రదించగా నో చెప్పినట్లుగా సమాచారం. ఇటీవలే మేము కలిసి ఓ సినిమా చేశామని, మళ్ళీ నటిస్తే ప్రేక్షకులు భోర్‏గా ఫీల్ అవుతారని చెప్పాడట. ఇందులో సమంత కాకుండా వేరే హీరోయిన్ కోసం వెతకమని చెప్పినట్లుగా టాక్. దీంతో మరో హీరోయిన్ కోసం చిత్రయూనిట్ అన్వేషిస్తునట్టు సమాచారం.

Also Read: అక్కినేని యంగ్ హీరో సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు.. ఏ సినిమా కోసమంటే…

Photo leak : నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీనుంచి ఫోటో లీక్… హాకీ ప్లేయర్ గా కనిపించనున్న అక్కినేని యంగ్ హీరో