ఆ దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు.. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు లాక్‌డౌన్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల అధికంగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కేసులు, మరణాల...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల అధికంగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ముందే కరోనాకు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా వ్యాధి మరింతగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే అన్ని దేశాల్లో కరోనా కట్టడకి లాక్‌డౌన్ విధించగా, ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియలను కొనసాగిస్తున్నాయి. ఇక తాజాగా మెక్సికో దేశంలో మాత్రం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించక తప్పడం లేదని మెక్సికో అధికారులు తెలిపారు.
మెక్సికో చుట్టూ అవసరమైన కార్యాకలాపాలు నిషేధించి, పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం నుంచి వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని శివారు ప్రాంతాల నివాసితులు స్వేచ్ఛగా తిరగడాన్ని నిషేధించలేదు. టెక్ అవుట్ సర్వీసులు, దుకాణాలు మూసివేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేశారు. ప్రస్తుతం కోవిడ్‌తో 75శాతం ఆస్పత్రులు నిండిపోయాయి. రాబోయే మూడు వారాల్లో కరోనా వ్యాప్తి, మరణాల సంఖ్యను తగ్గించుకునేందుకు లాక్‌డౌన్ లాంటి అసాధారణ చర్యలు ఎంతో అవసరమని మెక్సికో ఉప ఆరోగ్యశాఖ మంత్రి హ్యూగో లోపెజ్ గాటెల్ పేర్కొన్నారు.
మెక్సికోలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో ఈ లాక్‌డౌన్‌ను అమలు చేసినట్లు తెలిపారు. కాగా, మెక్సికో దేశ వ్యాప్తంగా 1.3 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, లక్షకుపైగా మరణించారు. ఇలా రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు సంభవించడంతో మరిన్ని ఆంక్షలు విధించనున్నారు.