AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో ప్రకృతి పగబట్టిన వేళ …..ఆరుగురు మారథాన్ రన్నర్స్ ని రక్షించిన గొర్రెల కాపరి, ‘హీరో’గా వెల్లువెత్తిన ప్రశంసలు

చైనాలో 100 కిలోమీటర్ల సుదీర్ఘ క్రాస్ కంట్రీ మౌంటెయిన్ మారథాన్ రేసుపై ప్రకృతి పగ బట్టింది. కొండలు, కోనలు, ఎత్తయిన ప్రదేశాల్లో ఈ మారథాన్ సాగుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

చైనాలో ప్రకృతి పగబట్టిన వేళ .....ఆరుగురు మారథాన్ రన్నర్స్ ని రక్షించిన గొర్రెల కాపరి,  'హీరో'గా  వెల్లువెత్తిన ప్రశంసలు
China
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 25, 2021 | 2:29 PM

Share

చైనాలో 100 కిలోమీటర్ల సుదీర్ఘ క్రాస్ కంట్రీ మౌంటెయిన్ మారథాన్ రేసుపై ప్రకృతి పగ బట్టింది. కొండలు, కోనలు, ఎత్తయిన ప్రదేశాల్లో ఈ మారథాన్ సాగుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గన్సు ప్రావిన్స్ లో ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు, వడగండ్ల తో బాటు ఈదురుగాలులతో కూడిన బీభత్స వాతావరణం ఏర్పడింది.(ఈ ప్రకృతి బీభత్సం కారణంగా 21 మంది మారధాన్లు మరణించారు). ఈ నెల 22 న కొండ ప్రాంతంపై తన గొర్రెలను మేపుకుంటున్న ఝూ కెమింగ్ అనే వ్యక్తి దీంతో బెదిరిపోయి దగ్గరలోనే ఉన్న చిన్న గుహలో తలదాచుకున్నాడు. అప్పటికే ఆ గుహలో కొని బట్టలు, ఆహార పదార్థాలు ఉంచుకున్న ఝూ.. కొద్దీ సేపటికి బయటికి వచ్చి చూసేసరికి మారథాన్ రన్నర్స్ లో కొందరు విపరీతమైన చలికి తట్టుకోలేక కింద పడిపోయి ఉండడం గమనించాడు. ఆ బీభత్స పరిస్థితుల్లోనే అతి కష్టం మీద వారిలో కొందరిని ఈ గుహలోకి తీసుకువచ్చి రక్షించాడు. వారికి తన బట్టలు కప్పి కాస్త వెచ్చదనం కల్పించాడు.. అంతటితో ఆగక మళ్ళీగుహ బయటికి వచ్చి చూసేసరికి మరి కొంత దూరంలో కొంతమంది పడిపోయి ఉండడం గమనించి మరో ముగ్గురిని ఈ చిన్నపాటి గుహలో చేర్చాడు. వీరంతా అక్కడి వెచ్చని వాతావరణానికి కాస్త సేద దీరారు . తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తమను కాపాడినందుకు అతడిని వారు ప్రశంసలతో ముంచెత్తారు. అతడికి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే కొనఊపిరితో ఉన్న మరికొందరిని తాను రక్షించలేక పోయానని ఝూ బాధ పడుతున్నాడు. తన కళ్ళముందే వారు మరణించడం చూసి తట్టుకోలేకపోయానన్నాడు. ఈ గొర్రెల కాపరి నుంచి ప్రాణాలు కాపాడుకున్నవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చైనా లోని సోషల్ మీడియా ఇతడిని హీరోగా అభివర్ణిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఓటీటీలోకి రానా, సాయి పల్లవి సినిమా.. ‘విరాటపర్వం’ విడుదల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Siddipet Additional SP: తలకు రుమాలు, ఆఫ్ షర్ట్‌‌తోపాటు పాత మోటార్ బైక్‌.. మారువేషంలో ఆడిషనల్ ఎస్పీ.. పోలీసులకు షాక్..!