AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన కోవిద్ యాంటీ బాడీ కాక్-టెయిల్ మెడిసిన్ వస్తోంది…వామ్మో !.డోసు ధర ఎంతంటే ?

కోవిడ్ చికిత్సలో వాడే తమ యాంటీ బాడీ కాక్-టెయిల్ తొలి బ్యాచ్ మెడిసిన్ ని ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు దీని ఉత్పాదక సంస్థ రోచె ఇండియా ప్రకటించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన కోవిద్ యాంటీ బాడీ కాక్-టెయిల్ మెడిసిన్ వస్తోంది...వామ్మో !.డోసు ధర  ఎంతంటే ?
Covid Anti Body Cocktail Used To Treat Trump Comes To India
Umakanth Rao
| Edited By: |

Updated on: May 25, 2021 | 1:11 PM

Share

కోవిడ్ చికిత్సలో వాడే తమ యాంటీ బాడీ కాక్-టెయిల్ తొలి బ్యాచ్ మెడిసిన్ ని ఇండియాలో లాంచ్ చేయనున్నట్టు దీని ఉత్పాదక సంస్థ రోచె ఇండియా ప్రకటించింది. కెసిరివిమాబ్, ఇమ్ డెవిమాబ్ అనే రెండు మందుల మిశ్రమంతో గల దీన్ని కాక్-టెయిల్ మందుగా వ్యవహరిస్తున్నారు. ఈ మెడిసిన్ డోసు ధర 59,750 రూపాయలట…దీన్ని గత ఏడాది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కోవిద్ బారిన పడినప్పుడు వాడినట్టు రోచె సంస్థ వెల్లడించింది. 1200 ఎంజీల డ్రగ్ లో ఒక్కొక్కటి 600 ఎంజీల కెసిరివిమాబ్, ఇంతే ఎంజీల ఇమ్ డెవి మాబ్ ఉంటాయని రోచె ఇండియా వెల్లడించింది. దీని గరిష్ట ధర లక్షా 19 వేల 500 రూపాయలని వివరించింది.ఒక్కో ప్యాక్ ఇద్దరు కోవిద్ రోగులకు సరిపోతుందని, ఇండియాలో దీని మెదటి బ్యాచ్ ని సిప్లా సంస్థ మార్కెట్ చేస్తుందని వెల్లడించింది. రెండో బ్యాచ్ జూన్ మధ్యకల్లా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మొత్తం మీద రెండు లక్షల మంది కోవిద్ రోగులకు మొదటి బ్యాచ్ ఉపయోగకరమని భావిస్తోంది. ఈ మెడిసిన్ పేరున్న కార్పొరేట్ ఆసుపత్రులు, కోవిద్ ట్రీట్ మెంట్ సెంటర్లలో లభించనుంది. ఇండియాలో ఈ యాంటీ బాడీ కాక్-టెయిల్ మందు అత్యవసర వినియోగానికి ఇటీవల సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతించింది.

కాగా ఇంత ఖరీదైన మందు కోటీశ్వరులకే అందుబాటులో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే కోవిద్ చికిత్సకు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఇస్తున్న పసరు మందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని ఆయుర్వేద విభాగం ప్రకటించింది.. ఉచితంగా ఇస్తున్న ఈ మందుకు వేలాది రోగులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య చికిత్సా శిబిరం వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు హర్యానాలో రామ్ దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి సంస్థ మందు కొరొనిల్ ని ఉచితంగా రోగులకు ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వివాహం జరుగుతుండగా వధూవరులు సయ్యాలాట.. ఫన్నీ వీడియో వైరల్.!

Google Photos: గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? జూన్‌ 1 నుంచి ఉచిత స్టోరేజీ ఉండదు.. మరి ఎక్కువ స్టోరేజీ కావాలంటే..

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..