Chittor: చిత్తూరు జిల్లాలో విషాదం.. క్వారీ గుంతలో మూడు మృతదేహాలు లభ్యం..
3 dead bodies found in quarry pond: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని
3 dead bodies found in quarry pond: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని ఓ క్వారీ గుంతలో తల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో కనిపించాయి. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. రామాపురంలోని అన్నాస్వామి గండిచెరువు క్వారీ గుంతలో మూడు మృతదేహాలు కనిపించడం మిస్టరీగా మారింది. చెరువులో తేలియాడుతున్న మృతదేహాలను చూసి అటుగా వెళ్తున్న వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అధికారులు సంఘటనా స్థలనానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు. మృతులు.. నీరజ (32), చందు (8), చైత్ర (2) మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు.
కాగా.. ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న కంపోస్టు యార్డులో ఓ ద్విచక్రవాహనం లభ్యమైంది. దీంతో ఈ వాహనానికి మృతులకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు తీస్తున్నారు. చనిపోయిన వారిని పెనుమూరు మండలం గుండ్యాలపల్లి వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: