Google Photos: గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? జూన్‌ 1 నుంచి ఉచిత స్టోరేజీ ఉండదు.. మరి ఎక్కువ స్టోరేజీ కావాలంటే..

Google Photos: మీరు గూగుల్‌ ఫోటోస్‌ వాడుతున్నారా.. మీ ఫోటోలన్నీ గూగుల్‌ ఫోటోస్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారా..? అయితే ఇక నుంచి ఆ అవకాశం ఉండదు. గూగుల్‌ ఫోటోస్‌లోకి..

Google Photos: గూగుల్ ఫోటోస్ వాడుతున్నారా? జూన్‌ 1 నుంచి ఉచిత స్టోరేజీ ఉండదు.. మరి ఎక్కువ స్టోరేజీ కావాలంటే..
Google Photos
Follow us
Subhash Goud

|

Updated on: May 25, 2021 | 12:53 PM

Google Photos: మీరు గూగుల్‌ ఫోటోస్‌ వాడుతున్నారా.. మీ ఫోటోలన్నీ గూగుల్‌ ఫోటోస్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారా..? అయితే ఇక నుంచి ఆ అవకాశం ఉండదు. గూగుల్‌ ఫోటోస్‌లకు అన్‌లిమిటెడ్‌ స్టోరేజీ ఇక ఉండదు. 2021 జూన్‌ 1 నుంచి అన్‌లిమిటెడ్‌ స్టోరేజీ ఉండదని గూగుల్‌ గతంలోనే ప్రకటించింది. అంటే గడువు ముగిసే సమయం దగ్గరకు వచ్చేసింది. 2021 జూన్ 1 నుంచి మీరు అప్‌లోడ్ చేసే ఫోటోలన్నీ మీకు గూగుల్ ఉచితంగా ఇచ్చే 15జీబీ అకౌంట్‌లోకి వెళ్తాయి. ఇప్పటికే మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోలకు ఈ నియమం వర్తించదు. అంటే మే 31 వరకు మీరు ఎన్ని ఫోటోలు అప్‌లోడ్ చేసినా అన్‌లిమిడెట్ కోటాలోకే వెళ్తుంది. జూన్ 1 నుంచి మీరు 15 జీబీ వరకే ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లో ఇప్పటికే ఎక్కువ ఫైల్స్ ఉన్నట్లయితే ఎక్కువ ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయలేరు.

ఇక ఎక్కువగా స్టోరేజీ కావాలనుకుంటే పరిష్కారం ఉంది. ఇందు కోసం మీరు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అదనంగా స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ వన్‌లో మూడు రకాల ప్లాన్స్ ఉన్నాయి. నెలకు రూ.130 లేదా ఏడాదికి రూ.1300 చెల్లిస్తే 100జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నెలకు రూ.210 లేదా ఏడాదికి రూ.2100 చెల్లిస్తే 200జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నెలకు రూ.650 లేదా ఏడాదికి రూ.6500 చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇలా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అదనంగా స్టోరేజీ లభిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Gold Hallmarking: బంగారం హాల్‌మార్కింగ్‌ గడువు జూన్‌ 15 వరకు పెంపు.. హాల్‌మార్కింగ్‌ అంటే ఏమిటి..?

Provident Fund: పీఎఫ్‌ డబ్బులతో లోన్‌ ఈఎంఐ కట్టుకోవచ్చా..? ప్రీమియంలు కూడా చెల్లించవచ్చా..? రూ.7 లక్షల బీమా